ఆంధ్రప్రదేశ్‌

అక్కసుతోనే కుట్రలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, సెప్టెంబర్ 1: గుంటూరులో జరిగిన నారా హమారా - టీడీపీ హమారా సభలో గొడవలకు ప్రతిపక్ష నేత జగనే బాధ్యుడని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, ఎమ్మెల్సీ వైవీబీ రాజేంద్రప్రసాద్ ఆరోపించారు. బీజేపీ, వైసీపీలు కలిసి కుట్ర పన్ని వైసీపీ పార్టీ వాళ్లని పంపించి కావాలని గొడవ చేయించాయన్నారు. విజయవాడ పార్టీ కార్యాలయంలో శనివారం జరిగిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గుంటూరు సభలో గొడవలకు దీనికి పూర్తి బాధ్యత జగన్మోహన్‌రెడ్డి వహించాల్సి ఉందన్నారు. సభలో గొడవ చేసిన యువకులపై నంద్యాల, కర్నూలు పోలీసు స్టేషన్‌లలో పలు క్రిమినల్ కేసులున్నాయన్నారు. మీడియా పాయింట్ దగ్గరలో గొడవ చేయమని ఎస్‌ఎంఎస్ ఇచ్చిన మాట వాస్తవం కాదా అని అడిగారు. వాళ్లు నంద్యాల శిల్పా బ్రదర్స్ అనుచరులేనని అన్నారు. వాళ్లంతా వైసీపీ కార్యకర్తలు అనడానికి తమ దగ్గర పూర్తి సాక్ష్యాధారాలు ఉన్నాయన్నారు. ఇలాఉంటే బీజేపీ రాఫెల్ కుంభకోణంలో నిండా మునిగిపోయిందన్నారు. 2019 ఎన్నికల్లో రాఫెల్ అవినీతి బీజేపీ మెడకు ఉరికాబోతుందన్నారు. రూ. 500 కోట్ల రాఫెల్ యుద్ధవిమానాన్ని రూ. 1600 కోట్లు పెట్టి ఎందుకు కొనుగోలు చేస్తున్నారని ప్రశ్నించారు. 70 సంవత్సరాల పాటు యుద్ధరంగ విమానాలను తయారు చేసే అనుభవం ఉన్న ప్రభుత్వ రంగ సంస్థ హెచ్‌ఏఎల్ హిందుస్తాన్ ఏరోనాటికల్స్‌కు ఇవ్వకుండా 12 రోజులు క్రితం పుట్టిన అనిల్ అంబానీ కంపెనీకి రాఫెల్ యుద్ధ విమానాల డీల్‌ను ఎలా అప్పగిస్తారని ప్రశ్నించారు. వైసీపీ ప్రతిపక్ష పార్టీగా విఫలమైందని, ప్రజా సమస్యలపైనా జగన్మోహన్‌రెడ్డి స్పందించడం లేదన్నారు. సాక్షాత్తు వైసీపీ ఎమ్మెల్యే రాజన్న దొర తమ పార్టీ సమస్యలపై పోరాడం లేదని, తమ పార్టీ నాయకుడు నిద్రపోతున్నాడని ప్రకటనలిచ్చే దుస్థితికి వైసీపీ దిగజారిందన్నారు.