ఆంధ్రప్రదేశ్‌

తరలివచ్చిన గులాబీ దండు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్/ శామీర్‌పేట: తెలంగాణ రాష్ట్ర సమితి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రగతి నివేదిక సభకు భారీగా గులాబీ దండు కదిలింది. ప్రతిపక్ష పార్టీల విమర్శలకు దీటుగా లక్షలాది వాహనాలను టీఆర్‌ఎస్ కార్యకర్తలు సభకు హాజరయ్యారు. ఆదివారం మధ్యాహ్నం సభా ప్రాంగణం మినహా పరిసర ప్రాంతాల్లో అక్కడక్కడ వర్షం కురియడంతో సభ నిర్వహిస్తారా లేదా అనే ఆందోళన చెందిన పార్టీవర్గాలకు వరుణుడు కరుణించాడు. ప్రశాంతమైన వాతావరణంలో మధ్యాహ్నం వరకు మందకొడిగా వాహనాలు కనిపించినా చివరి నిమిషంలో వచ్చిన వాహనాలతో ఓటర్ రింగ్ రోడ్డు కిక్కిరిసిపోయింది. బొంగులూరు, తుక్కుగూడ ప్రాంతాల్లో ట్రాఫిక్ నిలిచిపోవడంతో గంటల తరబడి వేచి చూడాల్సి వచ్చింది. సకాలంలో ట్రాఫిక్‌ను నియంత్రించే కార్యక్రమాన్ని పోలీసు బలగాలు చేపట్టడంతో గంట వ్యవధిలోనే భారీ సంఖ్యలో వాహనాలు సభా స్థలికి చేరుకున్నాయి. రెండు కిలోమీటర్ల దూరంలో వాహనాలు పార్కు చేసి అక్కడి నుండి కాలినడకన కార్యకర్తలు వెళ్లారు. కరీంనగర్, సిద్దిపేట తదితర ప్రాంతాల నుంచి శామీర్‌పేట మీదుగా ఘట్‌కేసర్ బొంగులూరు వరకు చేరుకున్న వాహనాలు చివరి నిమిషంలో ట్రాఫిక్ జామ్ కావడంతో వెనుదిరిగాయి. జంట నగరాల నుంచి తక్కువ సమయంలోనే సభా స్థలికి చేరుకోవచ్చనే అభిప్రాయంతో ఆలస్యంగా వెళ్లిన వాహనాలూ సభాస్థలికి చేరుకోలేక వెనుదిరుగాయి. జంట నగరాల నుంచి ఎక్కువ శాతం ప్రైవేట్ స్కూల్ బస్సులను వినియోగించారు. కార్యకర్తల తరలింపునకు ఎక్కువగా ప్రైవేట్ వాహనాలను వినియోగించారు. మహేశ్వరం, ఎల్‌బీనగర్, ఉప్పల్, ఇబ్రహీంపట్నం, రాజేంద్రనగర్, చేవెళ్ల నియోజకవర్గాల నుంచి మోటార్ సైకిళ్లతో భారీ ర్యాలీని నిర్వహించి కార్యకర్తలు తరలివెళ్లారు. ప్రగతి నివేదన సభకు శివారు ప్రాంతాల నుంచి హాజరయ్యే కార్యకర్తలు, నాయకులు తమ తమ వాహనాల్లో మందు, విందులతో చిందులేస్తూ సభాకు తరలి వెళ్లారు. నాయకులు ప్రయాణించే వాహనాలు, బస్సుల్లో భారీగా మందు బాటిళ్లను తరలించారు. ప్రయాణం కొనసాగిన తరువాత శివారు ప్రాంతాలకు చేరుకున్న కొంత మంది నాయకులు తమ వాహనాలను నిలిపి రోడ్డు పక్కనే మందు సేవిస్తూ విందులతో డీజేలతో చిందులేశారు. మరికొంత మంది తమ వాహనాల్లోనే మందు సేవిస్తూ ఆహ్లాదకరంగా సభా స్థలికి చేరుకున్నారు. సభకు వెళ్తున్నామనే విషయాన్ని విస్మరించి బస్సుల్లోనే మందు బాటిళ్లు, నీరు, చిరుతిండిని ఏర్పాటు చేసుకొని ఎంజాయి చేస్తూ సభ స్థలికి చేరుకున్నారు. మందు బాటిళ్లను బస్సులో నుంచే బయటకు విసిరేస్తూ ఎంజాయి చేశారు. ఉదయానే్న సభా వేదికకు చేరుకున్న కార్యకర్తలకు ఆయా నియోజకవర్గాల వాహనాలను నిలిపేందుకు కేటాయించిన పార్కింగ్ స్థలాల్లోనే ప్రత్యేక వంటశాలలను ఏర్పాటు చేసి భోజనాలను వడ్డించారు. రైతులకు మంత్రి మహేందర్ రెడ్డి ప్రత్యేక భోజనాలను చేయించివారికి స్వయంగా వడ్డించారు.
రోడ్డుప్రమాదంలో ఒకరి మృతి
అబ్దుల్లాపూర్‌మెట్ వద్ద జరిగిన ప్రమాదంలో సూర్యాపేట జిల్లా గౌరారం మండలానికి చెందిన అబ్దుల్ మృతిచెందాడు.