ఆంధ్రప్రదేశ్‌

కరవు పీడిత రైతుల్ని ఆదుకోండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, సెప్టెంబర్ 2: సీపీఐ, సీపీఎం రాష్ట్ర కమిటీల ఆధ్వర్యంలో రాష్టవ్య్రాప్తంగా జరుగుతున్న మహాగర్జన బస్సుయాత్ర కర్నూలు జిల్లాలో పర్యటించిన సందర్భంగా తాము గుర్తించిన రైతుల కష్టాలను సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కే రామకృష్ణ ఆదివారం ఓ లేఖ రూపంలో సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకొచ్చారు. కరవు తీవ్రత వల్ల రాష్ట్రం మొత్తం మీద 60శాతం ప్రాంతం దుర్భిక్షంగా మారుతోందన్నారు. అప్పులు తెచ్చి అరకొర పంటలు వేసిన రైతుల పరిస్థితి మరింత దయనీయంగా ఉందన్నారు. తీవ్ర వర్షాభావ పరిస్థితులు, కరవు కారణంగా రాయలసీమ జిల్లాల్లో లక్షలాది ఎకరాల్లో పంటలు వేయలేదన్నారు. కర్నూలు జిల్లాలో అక్కడక్కడ బోర్లు, బావులున్న ప్రాంతాల్లో రైతులు ఉల్లి పంట పండించారని, రైతు కష్టించి పండించిన పంటను మార్కెట్‌లో కొనేదిక్కు లేకుండాపోయిందన్నారు. ఉల్లి క్వింటాల్ రూ. 1500లకు కొనుగోలు చేస్తేతప్ప రైతకు గిట్టుబాటు కాని పరిస్థితి నెలకొందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చి మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీం కింద చర్యలు చేపట్టి పంట పండించిన రైతులను ఆదుకోవాల్సిందిగా రామకృష్ణ లేఖలో కోరారు. కర్నూలు జిల్లా ఆలూరు మండలం తుమ్మలజీడు గ్రామంలో వృద్ధ రైతు దంపతులు నెరినికి రామయ్య, వన్నూరమ్మ పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకున్నారని అన్నారు. బ్యాంక్ బకాయిలు తీర్చమని నోటీసురాగా అప్పు కట్టలేని స్థితిలో ఆత్మహత్య చేసుకున్న వీరి కుటుంబానికి ప్రభుత్వం రూ. 10లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాల్సిందిగా రామకృష్ణ డిమాండ్ చేశారు.