ఆంధ్రప్రదేశ్‌

పోలవరానికి జగన్ అడ్డంకులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, సెప్టెంబర్ 2: పోలవరం ప్రాజెక్టును ఇప్పటివరకు లక్షలాది మంది ప్రజలు సందర్శించి ప్రశంసిస్తుంటే ప్రతిపక్ష నేత జగన్ కనీసం ప్రాజెక్టును చూడకుండా తన అనుచరుల చేత కేసులు వేయిస్తూ అడ్డుకోవాలని నాటకాలాడుతున్నారని జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు విమర్శించారు. ఆదివారం నగరంలోని జలవనరుల శాఖ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టును ఇప్పటివరకు రాష్ట్రంలోని యువత, రైతులు, మీడియా ప్రతినిధులు, రైతుకూలీలు, ఉద్యోగులు, మహిళలు ఎందరో చూసి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న మహాయజ్ఞాన్ని ప్రశంసిస్తుంటే ప్రతిపక్ష నాయకుడికి చూసే తీరిక కూడా లేదన్నారు. గుంటూరులో తెలుగుదేశం పార్టీ నిర్వహించిన ముస్లిం మైనార్టీల సభకు లక్షల మంది హాజరైతే చూసి ఓర్వలేక వైసీపీ కార్యకర్తలను పంపి అల్లర్లు చేయిస్తున్నారంటే రాజకీయ నాయకులుగా బాధ్యత లేకుండా వ్యవహరిస్తున్నట్లు వీరి ప్రవర్తన తెలియజేస్తోందన్నారు. రాజన్న రాజ్యంలో ఏమి జరిగిందో ప్రజలందరికీ తెలుసని, మంత్రులు, ఎమ్మెల్యే, ఐఏఎస్‌లు, సెక్రటరీలు జైలుకెళ్లారన్నారు. అంతేకాకుండా రాజన్న రాజ్యంలో దోచుకున్న వారు ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో అసెంబ్లీ, పార్లమెంట్‌కు పోటీ చేయడానికి వస్తున్నారని మంత్రి ఉమా ఎద్దేవా చేశారు.