ఆంధ్రప్రదేశ్‌

హోదా ఇవ్వాల్సిందే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వినుకొండ, ఆగస్టు 2: రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ నవతరం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్కే నాయుడు ఆదివారం గుంటూరు జిల్లా వినుకొండలో బీఎస్‌ఎన్‌ఎల్ టవర్‌ను ఎక్కాడు. ఉదయం తొమ్మిదిన్నర గంటలకు టవర్ కింద బేనర్ కట్టి ఆయన టవర్ పైకెక్కాడు. సమాచారం తెలుసుకున్న ప్రజలు, పోలీసులు, ఫైర్ సిబ్బంది, రెవెన్యూ సిబ్బంది హడావుడిగా అక్కడికి చేరుకున్నారు.
అధికారులు బతిమాలినా ఆయన కిందికి దిగలేదు. దీంతో పట్టణ సీఐ శ్రీనివాసరావు ఫోన్‌లో నాయుడుతో మాట్లాడి అతని డిమాండ్‌ను ప్రభుత్వానికి, ఉన్నతాధికారులకు తెలుపుతామని హామీ ఇచ్చారు. దీంతో మధ్యాహ్నం 2గంటల సమయంలో ఆయన కిందికి దిగాడు. అనంతరం ఆర్కే నాయుడు విలేఖరులతో మాట్లాడుతూ అధికార పార్టీ నాయకులు కేంద్రంతో పోరాడి రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించాలన్నారు. సమస్య తీవ్రత తెలపడం కోసమే తాను సెల్‌టవర్ ఎక్కినట్లు వివరించారు. నియోజకవర్గంలోని శావల్యాపురం మండలం శానంపూడి గ్రామానికి చెందిన ఆర్కే నాయుడుతో పాటు నవతరం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు లావు సుబ్రహ్మణ్యం, చిలకలూరిపేట పట్టణ అధ్యక్షుడు రంగ ప్రతాప్‌లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆత్మహత్యా ప్రయత్నం చేశాడంటూ ఆర్కే నాయుడుపై కేసు నమోదు చేశారు.

చిత్రం..బీఎస్‌ఎన్‌ఎల్ టవర్‌పై ఆర్కే నాయుడు.
(ఇన్‌సెట్) విలేఖరులతో మాట్లాడుతున్న దృశ్యం