ఆంధ్రప్రదేశ్‌

పులిచింతల ముంపు గ్రామాలు ఖాళీ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మాచవరం, సెప్టెంబర్ 2: పులిచింతల ముంపు ప్రాంతాలైన రేగులగడ్డ, వెల్లంపల్లి గ్రామాల్లో ఆదివారం పులిచింతల స్పెషల్ కలెక్టర్ విజయచందర్ ఆధ్వర్యంలో బాధితులను బలవంతంగా ఖాళీ చేయించారు. నష్టపరిహారం ఇంకా రావాల్సి ఉంటే తప్పనిసరిగా రెండురోజుల్లో అందజేస్తామని, పరిహారం కన్నా ప్రాణం ముఖ్యమని, ప్రభుత్వ అధికారుల మాటలు వినాలని, తక్షణమే పునరావాస కేంద్రాలకు వెళ్లాలని సూచించారు. నాగార్జున సాగర్ నుండి నీరు విడుదల చేయడంతో పులిచింతల ముంపు గ్రామమైన వెల్లంపల్లి పూర్తిస్థాయిలో మునిగిపోయే ప్రమాదం ఏర్పడింది. వారం రోజులుగా ప్రభుత్వ అధికారులు గ్రామంలో తిష్టవేసి ఖాళీ చేయించేందుకు ప్రయత్నించినా పూర్తిస్థాయిలో సఫలం కాలేదు. దీంతో పులిచింతల, రెవెన్యూ, పోలీసు అధికారుల ఆధ్వర్యంలో ఆదివారం ఈ గ్రామాలను ఖాళీ చేయించారు.
అలాగే కృష్ణానది వద్ద వరద ఉద్ధృతితో నీటి ఉరవడి పెరిగే అవకాశమున్న దృష్ట్యా నాటుపడవలు, బల్లకట్ల ద్వారా ప్రజలను నది దాటించరాదని హెచ్చరించారు. కృష్ణానది వద్ద పోలీసు పహరాతో పాటు పునరావాస కేంద్రాలకు సామగ్రిని తరలించారు. స్పెషల్ కలెక్టర్ వెంట డిప్యూటీ కలెక్టర్ ధనుంజయరావు, సత్తెనపల్లి డీఎస్పీ కాలేషా వలీ, పిడుగురాళ్ల రూరల్ సీఐ సుబ్బారావు, గురజాల ఆర్డీవో మురళి, తహశీల్దార్ తుపాకుల మస్తాన్, ఎస్‌ఐ జగదీష్, సిబ్బంది పాల్గొన్నారు.

చిత్రం....ముంపు బాధితులతో మాట్లాడుతున్న స్పెషల్ కలెక్టర్, డీఎస్పీ