ఆంధ్రప్రదేశ్‌

6 నుంచి నేషనల్ ర్యాంకింగ్ టేబుల టెన్నిస్ టోర్నీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, సెప్టెంబర్ 3: ఆంధ్రప్రదేశ్ టేబుల్ టెన్నిస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 6 నుండి 12వ తేదీ వరకు నేషనల్ ర్యాంకింగ్ టీటీ టోర్నీ నిర్వహిస్తున్నట్లు టీటీ రాష్ట్ర కార్యదర్శి ఎస్‌ఎం సుల్తాన్ తెలిపారు. సోమవారం స్థానికంగా జరిగిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నగరంలోని దండమూడి రాజగోపాలరావు ఇండోర్ స్టేడియంలో 11వ స్పోర్ట్స్ నేషనల్ ర్యాంకింగ్ టేబుల్ టెన్నిస్ టోర్నమెంట్ సెప్టెంబర్ 6 నుంచి 12 వరకు జరుగుతుందన్నారు. టేబుల్ టెన్నిస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఏపీటీటీఏ ఈ టోర్నమెంట్ నిర్వహిస్తుందని పేర్కొన్నారు. ఈ టోర్నమెంట్‌లో జకార్తాలో ఇటీవల జరిగిన ఆసియా క్రీడల్లో పాల్గొన్న అత్యున్నత స్థాయి క్రీడాకారులు పాల్గొంటారని తెలిపారు.
జి సతియాస్, ఎ అమలరాజ్, హర్మీత్ దేశాయ్, మానవ్ థాకర్, సనీల్‌శెట్టి, మణికా బాత్రా, ఆహికా ముఖర్జీ, వౌమాదాస్, మధురిక పాట్కర్ వంటి పలువురు క్రీడాకారులు పాల్గొంటారని తెలిపారు. సబ్ జూనియర్, జూనియర్, యూత్, పురుషులు మరియు మహిళలు విభాగాల్లో పోటీలు జరుగుతాయన్నారు.
ఈ టోర్నమెంట్‌లో సుమారు 700 మంది క్రీడాకారులు పాల్గొంటారని తెలిపారు. అన్ని జాతీయ ర్యాంకింగ్ ఆటగాళ్లు ఈ టోర్నమెంట్‌లో పాల్గొంటారని అన్నారు. విజేతలకు రూ.7 లక్షలను నేరుగా పంపిణీ చేస్తారని పేర్కొన్నారు. ఈ విలేఖరుల సమావేశంలో మీడియా కోఆర్డినేటర్ ఎన్ శ్రీ్ధరన్, అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు.