ఆంధ్రప్రదేశ్‌

కేసుల్లో తీర్పు జాప్యమయ్యేలా.. ప్రధాని మోదీ, అమిత్ షా, జగన్ కుట్ర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, సెప్టెంబర్ 3: భారతదేశంలో అత్యంత అవినీతిపరుడైన రాజకీయవేత్తగా సీబీఐ న్యాయస్థానంలో 11 ఛార్జీషీట్లు, ఎన్ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌లో ఐదు ఛార్జీషీట్లు ఎదుర్కొంటూ ప్రతి శుక్రవారం సీబీఐ న్యాయస్థానం వద్ద ముద్దాయిగా హాజరయ్యే రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడు జగన్‌మోహన్‌రెడ్డిపై కోర్టులో విచారణ జాప్యం జరగడం వెనుక పెద్దకుట్ర ఉందని ఆర్టీసీ చైర్మన్, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య ధ్వజమెత్తారు. సోమవారం తన ఛాంబర్‌లో మీడియాతో మాట్లాడుతూ 2019 ఎన్నికలు పూర్తయ్యేంత వరకు జగన్‌పై కోర్టులో విచారణ సాగదీయాలని, ఎన్నికలు అయిపోయేంత వరకు అవినీతి కేసుల్లో తీర్పు వెలువడ కూడదనేది ఈ కుట్ర సారాంశం అన్నారు. ఈ కుట్రలో ప్రధాన పాత్రదారులు ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ అధ్యక్షులు అమిత్ షా, ముద్దాయి జగన్ అన్నారు. జగన్మోహన్ రెడ్డి జైలుకు పోకుండా కేసులు విచారణ సాగదీసి తద్వారా 2019 ఎన్నికల్లో లబ్ధి పొందాలని, చంద్రబాబును సాధించాలనేది భారతీయ జనతా పార్టీ వ్యూహం అన్నారు. అందుకే ఈ కుట్ర అన్నారు. ఇప్పటికైనా మోదీ, అమిత్ షాలు ఈ కుట్రను బట్టబయలు చేయాలని రామయ్య డిమాండ్ చేశారు. 11 కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న జగన్మోహన్‌రెడ్డికి బాహాటంగా దేశ ప్రధాని మద్దతు తెలియజేయడం అత్యంత విచారకరం అన్నారు. 2012 మార్చి 31న సీబీఐ కోర్టులో జగన్‌పై మొదటి ఛార్జీషీటు వేస్తే ఇప్పటి వరకు విచారణ పూర్తి చేయకపోవడం ఈ కుట్రలో భాగమేనని అన్నారు. జగన్మోహన్‌రెడ్డి అతి తక్కువకాలంలో ఇన్ని కోట్లు ఎలా సంపాదించారని సుప్రీంకోర్టులో డివిజన్ బెంచ్ వ్యాఖ్యానిస్తే ఇప్పటివరకు ఆ కేసుల్లో విచారణ పూర్తి కాకపోతే ఇది కుట్ర కాదా అన్నారు. అత్యంత అవినీతిపరుడుగా ముద్రపడ్డిన జగన్ ద్వారా వైఎస్‌ఆర్ పాలన తీసుకు వద్దాం అని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ వ్యాఖ్యానించడం అవినీతికి పరాకాష్ట అన్నారు. వైఎస్‌ఆర్ పాలన అంతా అవినీతిమయం అన్నారు. వైఎస్‌ఆర్ పాలనలోనే అవినీతిపరులకు రెక్కలు వచ్చాయన్నారు., ఫ్యాక్షనిస్టులు పంజావిప్పారన్నారు. జగన్ లాంటి సామాన్యులు లక్షల కోట్లు అవినీతి మార్గాన సంపాదించారని అన్నారు. ఐఏఎస్ అధికారులు జైలు పాలయ్యారన్నారు. ప్రభుత్వ భూములు వేలాది ఎకరాలు అవినీతి పారిశ్రామికవేత్తల పరం చేశారన్నారు. క్విడ్ ప్రోకో ద్వారా జగన్ కంపెనీల్లో పెట్టుబడులుగా వేలాది కోట్లు గుప్పించారన్నారు. చంద్రబాబు హయాంలో పారిశ్రామికవేత్తలు అమెరికా ప్రెసిడెంట్ బిల్ క్లింటన్ పక్కన కూర్చుంటే, వైఎస్‌ఆర్ హయాంలో వారు జైల్లో కూర్చున్నారని అన్నారు. ఐఏఎస్ టాపర్ శ్రీలక్ష్మి లాంటి వారు జగన్ అవినీతికి, వైఎస్‌ఆర్ కుటుంబ అవినీతికి బలైపోయి అచేతనంగా మంచానికే పరిమితం అయ్యారని అన్నారు.
జగన్మోహన్‌రెడ్డికి ధైర్యముంటే తన కేసుల విచారణ త్వరితగతిన పూర్తి చేసి 2019 ఎన్నికల లోపు తీర్పు వెలువరించాలని న్యాయస్థానాన్ని కోరగలరా అని అడిగారు. పటిష్ఠమైన సాక్ష్యాలున్న ఈ కేసులో తీర్పు వస్తే జగన్ శేషజీవితమంతా రాజమండ్రి సెంట్రల్ జైలులో గడపాల్సిందేనన్నారు. ఈడీ కేసులో తీర్పు వేస్తే న్యూఢిల్లీ తీహార్ జైలు ఖాయమని వర్ల రామయ్య అన్నారు.