ఆంధ్రప్రదేశ్‌

సాంకేతిక పరిజ్ఞానంతో ప్రజలకు మెరుగైన సేవలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు, సెప్టెంబర్ 3: సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్ధవంతంగా వినియోగించుకుంటూ ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర డీజీపీ ఆర్‌పి ఠాకూర్ అన్నారు. ప్రకాశం జిల్లా ఒంగోలులోని పోలీసు కార్యాలయంలో సోమవారం ఏర్పాటుచేసిన పలు కార్యక్రమాల్లో డీజీపీ పాల్గొన్నారు. ఈసందర్భంగా డీజీపీ జిల్లా పోలీసు శాఖ ప్రజలు, పోలీసుల సమస్యల పరిష్కారం కోసం రూపొందించిన ఐకాప్ యాప్‌ను, అదేవిధంగా మహిళలు, బాలికల హక్కులపై అవగాహన కల్పిస్తూ రూపొందించిన పుస్తకాన్ని ఆవిష్కరించారు. పొదిలి, కందుకూరులో పోలీసు శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన పెట్రోలు బంకులను రిమోట్ కంట్రోల్ ద్వారా డీజీపీ ప్రారంభించారు. మహిళల రక్షణ కోసం 25మంది మహిళా పోలీసులతో ఏర్పాటుచేసిన సఖీ టీమ్‌కు సైకిళ్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం డీజీపీ మాట్లాడుతూ ప్రజలు, పోలీసులు ఎలాంటి ఇబ్బంది లేకుండా తమ సమస్యలు తెలియచేసేందుకు రూపొందించిన ఐకాప్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. దీనివలన సమస్యలు తెలియచేయడంతోపాటు అవాస్తవాలను సమర్ధవంతగా తిప్పికొట్టవచ్చునని తెలిపారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి వివిధ జిల్లాలు పలు కార్యక్రమాలను చేపడుతున్నాయని, వాటన్నింటినీ ఏకీకృతం చేసి ప్రజలకు మరింత ఉపయోగకరంగా తీర్చిదిద్దుతామని తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో వివిధ రకాల నేరాలు జరుగుతున్నాయని, వీటిని నియంత్రించాలంటే సాంకేతికతను వినియోగించుకోవాల్సిన అవసరం ఎంతో ఉందన్నారు. అలాగే సిబ్బంది కూడా తమ నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలని సూచించారు. ఈకార్యక్రమంలో జిల్లా ఎస్పీ సత్యఏసుబాబు మాట్లాడుతూ జిల్లాలో ప్రతి సోమవారం గ్రీవెన్స్‌సెల్ నిర్వహిస్తున్నామని, ఈ గ్రీవెన్స్‌సెల్‌లో వస్తున్న ఫిర్యాదులను వెంటనే పరిష్కరించేందుకు కృషిచేస్తున్నట్లు తెలిపారు. రోడ్డుప్రమాదాలను నివారించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు ఎస్పీ తెలిపారు. జిల్లాలో శాంతిభద్రతల పరిస్థితి బాగానే ఉన్నట్లు పేర్కొన్నారు. ఈకార్యక్రమంలో గుంటూరు రేంజ్ ఐజి కెవివి గోపాల్‌రావు, జిల్లా ఎస్‌పి సత్యఏసుబాబు పాల్గొన్నారు.