ఆంధ్రప్రదేశ్‌

కరవు పరిస్థితులను అధిగమించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, సెప్టెంబర్ 3: రాష్ట్రంలో కరవు ప్రభావిత ప్రాంతాల్లో సమర్థ నీటి నిర్వహణ చేపట్టాలని అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదేశించారు. ప్రజలకు నీరందించాల్సిన బాధ్యత మీదే అని స్పష్టంచేశారు. ఉల్లి కొనుగోళ్లలో దళారుల ప్రమేయాన్ని నియంత్రించాలన్నారు. నాణ్యమైన ఉత్పత్తులకు గిట్టుబాటుధర కల్పించేందుకు చర్యలు చేపట్టాలని సూచించారు. సోమవారం నీరు- ప్రగతి, వ్యవసాయం పురోగతిపై ఉన్నతాధికారులు, జిల్లా కలెక్టర్లతో ముఖ్యమంత్రి టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. నరేగాలో పది అవార్డులు రాష్ట్రానికి అందటం గర్వకారణమని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు హర్షం వ్యక్తంచేశారు. 2016-17లో 5 అవార్డులు వచ్చాయి.. 2017-18 10 అవార్డులు చేజిక్కించుకున్నాం .. ఈ ఏడాది 20 అవార్డులు సాధించాలని నిర్దేశించారు. ఏటా రెట్టింపు అవార్డులు ప్రగతికి కొలమానాలన్నారు. పారదర్శకత, జవాబుదారీతనం, ఉపాధి హామీ అనుసంధానం, సుపరిపాలనలో ఎక్కువ పనులు చేసినందుకు ఈ అవార్డులు లభించాయన్నారు. దేశంలో అత్యుత్తమ ఫలితాలు విశళాఖ, ప్రకాశం జిల్లాలు సాధించాయని ఈ ఘనతకు కారణమైన అధికారులను ముఖ్యమంత్రి అభినందించారు. మున్ముందు మరింత పురోగతి సాధించాలని ఆకాంక్షించారు. వర్షపునీటిని భూగర్భజలాలుగా మార్చే బృహత్తర కార్యక్రమం చేపట్టామన్నారు. రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో తీవ్ర వర్షాభావం ఉందని 45 నుంచి 60 శాతం లోటు ఏర్పడిందని వివరించారు. 86 రిజర్వాయర్లలో 67 శాతం నీరు చేరటం ఆశాజకనంగా ఉందన్నారు. వీటిలో 651 టీఎంసీల నీరు చేరిందని, ఇంకా 310 టీఎంసీలకు అవకాశం ఉందని తెలిపారు. శ్రీశైలంలో 7 టీఎంసీలు, నాగార్జునసాగర్‌లో 7 టీఎంసీలు, పులిచింతలలో 29 టీఎంసీల నీరు చేరాల్సి ఉందన్నారు. మూడు రిజర్వాయర్లకు ఇంకా 43 టీఎంసీలు రావాలన్నారు. 40వేల క్యూసెక్కుల నీటిని రాయలసీమకు వదులుతున్నాం.. సోమశిల, కండలేరు జలాశయాలకు నీటిని తరలిస్తున్నాం.. సోమశిలలో 75 టీఎంసీలకు గాను 24 టీఎంసీలు నిల్వ చేశాం.. 15వేల టీఎంసీల నీటిని దిగువకు వదులుతున్నామని అధికారులు తెలిపారు. నాలుగేళ్ల జలసంరక్షణ చర్యలు సత్ఫలితాలను ఇస్తున్నాయని ముఖ్యమంత్రి సంతృప్తి వ్యక్తంచేశారు. ఈ కష్టార్జితం మనందరిదీ అన్నారు. వర్షం కురిసినా, లేకున్నా పంట దిగుబడులు తగ్గకుండా చూడాలని కోరారు. ఉద్యానవన పంటల విస్తీర్ణం 33 లక్షల ఎకరాల నుంచి కోటి ఎకరాలకు చేరాలని నిర్దేశించారు. రాష్ట్రంలో రెండుకోట్ల ఎకరాల్లో సాగునీటి సదుపాయం కల్పించాలని సూచించారు. ఇప్పటి వరకు 96 శాతం విస్తీర్ణంలో పంటలు వేశారు.. ఏ సమస్యలేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ రూపుదిద్దుకోవాలన్నారు.
భూగర్భ, ఉపరితల జలాలు, వర్షపునీటి సమర్థ నిర్వహణ జరగాలన్నారు వర్షాభావం ఉన్నచోట చెరువులు నింపాలన్నారు. రెయిన్‌గన్స్ ద్వారా పంటలు ఎండిపోకుండా కాపాడాలని ఆదేశించారు. కరవు, వరదలు వచ్చినా నీటి సమర్థ నిర్వహణ జరగాలన్నారు. విపత్తులలో రైతులకు ఇబ్బందిలేకుండా చూడాలని, కరవు మండలాల్లో నరేగా పనులను ముమ్మరం చేయాలన్నారు. ఐదు జిల్లాల్లో రూ 113 కోట్ల విలువైన పనులు చేపట్టాలన్నారు. కంటింజెన్సీ ప్లాన్ అమలు చేయాలని, ప్రత్యామ్నాయ పంటల విత్తనాలు పంపిణీ చేయాలని కోరారు. 7.41 లక్షల రైతులకు రూ 699 కోట్ల ఇన్‌పుట్ సబ్సిడీ అందించామని తెలిపారు. కౌలురైతులకు పంట రుణాలు అందించడంలో బ్యాంకర్లను ప్రోత్సహించాలని సూచించారు. నాణ్యమైన ఉల్లికి తగిన ధర వచ్చేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఉల్లి గ్రేడింగ్ యంత్రాలు రైతులకు అందుబాటులో ఉంచాలన్నారు. గ్రేడింగ్‌పై రైతుల్లో అవగాహన కల్పించాలని, మార్కెట్ జోక్యం ద్వారా రైతాంగాన్ని ఆదుకోవాలని ఆదేశించారు. రెండేళ్ల క్రితం ఇదే పరిస్థితుల్లో ఉల్లికి మార్కెట్ ఇంటర్వెన్షన్ వర్తింప చేశామని, ఇప్పుడు అదే విధంగా అమలు చేయాలని చెప్పారు. దళారుల ఆగడాలకు అడ్డుకట్ట వేసి రైతాంగానికి అండగా నిలవాలని నిర్దేశించారు. సరైన ధరకు ఉల్లి కొనుగోళ్లు జరపాలన్నారు. రైతుబజార్ల ద్వారా విక్రయాలు చేపట్టాలన్నారు. అంటువ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలని, మలేరియా, డెంగ్యూ ప్రబలుతున్న ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.
పారిశుద్ధ్యం మెరుగు పరచాలని, గ్రామాలు, వార్డులన్నీ పరిశుభ్రంగా ఉంచాలన్నారు. ఎప్పటికప్పుడు డ్రెయిన్లలో పూడిక తీయాలని ఆదేశించారు. అలసత్వాన్ని, అజాగ్రత్తను సహించేది లేదని హెచ్చరించారు. అవసరమైతే ఆయా ప్రాంతాల్లో పర్యటిస్తామని స్పష్టంచేశారు.