ఆంధ్రప్రదేశ్‌

అవార్డులకు ఎంపికైన అధ్యాపకులు వీరే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, సెప్టెంబర్ 4: రాష్ట్రంలోని వివిధ జూనియర్ కళాశాలల్లో అధ్యాపకుల కేటగిరిలో 13 మందిని ఉత్తన అధ్యాపకులుగా రాష్ట్ర ప్రభుత్వం ఎంపిక చేసింది. శ్రీకాకుళం జిల్లా పాలకొండ జీజేసీ ప్రిన్సిపాల్ బి.ప్రసాదరావు, విజయనగరం జిల్లా నెల్లిమర్ల జీజేసీ జెఎల్ ఎన్.రామకృష్ణ, విశాఖ జిల్లా చోడవరం జీజేసీ జెఎల్ వై.వి.అన్నపూర్ణ, తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం జీజేసీకి చెందిన ఎన్‌ఎస్‌ఎల్‌వి నరసింహం, పశ్చిమ గోదావరి జిల్లా ఆచంటకు చెందిన వి.శ్రీనివాసరావు ఎంపికయ్యారు.
కృష్ణా జిల్లా విజయవాడ శారదా జెసీకి చెందిన ఎల్.శ్రీ్ధర్, గుంటూరు జిల్లా గుంటూరు జీజేసీ గర్ల్స్‌కు చెందిన వి.అనూరాధ దేవి, ప్రకాశం జిల్లా ఒంగోలుకు చెందిన పి.స్వరాజ్య లక్ష్మి, నెల్లూరు జిల్లా దగదర్తికి చెందిన కె.శ్రీనివాసరావు, చిత్తూరు జిల్లా మదనపల్లికి చెందిన పి.ఉమా మహేశ్వరి, కడప జిల్లా చిన్నవోరంపాడుకు చెందిన ఎ.రామాంజనేయులు, కర్నూల్ జిల్లా కొడుమూరుకు చెందిన ఎన్.రాజిక సత్యప్రపూర్ణ, అనంతపురం జిల్లా గోరంటకు చెందిన ఎం.రమేష్‌కు ఎంపికయ్యారు. ప్రభుత్వ పాలిటెక్నిక్‌లకు సంబంధించి కాకినాడ ప్రిన్సిపాల్ కెఎస్ వర ప్రసాద్, కలికిరి ప్రిన్సిపాల్ ఎం.ఎస్.సుకుమార్, హెడ్ సెక్షన్ల విభాగంలో తాడెపల్లి గూడెంకు చెందినఎంపీ ఎంపీఎస్ మురళీ కృష్ణ, నంద్యాలకు చెందిన ఎంవిఎస్‌ఎస్‌ఎన్ ప్రసాద్, సీనియర్ లెక్చరర్ల విభాగంలో పి.మహబూబ్ బాషా (శ్రీకాకుళం), ఎస్.సర్వలింగేశ్వర రావు (కాకినాడ), జి.వెంకట సురేష్ (గూడూరు), ఎం.సత్యనారాయణ (రాజంపేట), లెక్చరర్ల కేటగిరిలో పి.శ్రీనివాసరావు (విశాఖ), పివిఎస్ గిరిబాబు (పాడేరు), ఎ.సుబహ్మ్రణ్యం (తాడేపల్లిగూడెం), ఎం.శ్రీనివాసరావు (పొన్నూరు), అన్నపురెడ్డి రామి రెడ్డి (గుంటూరు), పి.రామచంద్రయ్య (కడప), కె.తాసీలు (సత్యవీడు)లను ఎంపిక చేస్తూ మంగళవారం ఉత్తర్వులను జారీ చేసింది.