ఆంధ్రప్రదేశ్‌

ఆదరణ పనిముట్ల కొనుగోలులో అంతులేని అవినీతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ(సిటీ), సెప్టెంబర్ 4: టీడీపీ అధికారంలోని వచ్చి నాటి నుండి అమలు చేస్తున్న అన్ని పథకాల్లో పెద్ద ఎత్తున అవినీతి జరుగుతోందని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జంగా కృష్ణమూర్తి ఆరోపించారు. ఆదరణ - 2పథకం కింద పని ముట్ల కొనుగోళ్లలో అంతులేని అవినీతి జరిగిందన్నారు. మహిళా సాధికారతే వైకాపా లక్ష్యమన్న ఆయన వైకాపా అధికారంలోని వస్తే డ్వాక్రా రుణాలను సంపూర్ణంగా మాఫీ చేస్తామన్నారు. విజయవాడలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ చంద్రబాబును నమ్మి ఓటేస్తే రాష్ట్ర ప్రజలను దారుణంగా మోసం చేశారన్నారు. ప్రజాసంకల్ప యాత్రలో వైఎస్ జగన్‌తో ఇదే విషయాన్ని అందరూ చెబుతున్నారన్నారు. డ్వాక్రా రుణాలు మాఫీ చేయకపోవడంతో వడ్డీతో సహా రుణాలు పెరిగిపోయి రోడ్డున పడ్డట్టు మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారన్నారు. వడ్డీ లేని రుణాలను వైఎస్ ఇస్తే, చంద్రబాబు వడ్డీలకు చక్రవడ్డీలు వేశారని, ప్రస్తుతం ప్రతి ఒక్కో డ్వాక్రా మహిళపై సుమారు 8 వేల రూపాయల వడ్డీ భారం ఉందన్నారు. ఈ పరిస్థితుల్లో రాష్ట్రంలో ఉన్న మహిళలను ఆదుకోవాలనే సంకల్పంతో వైఎస్ ఆశయసాధనలో భాగమైన మహిళా సాధికారత దిశగా వైఎస్‌ఆర్ చేయూతను జగన్ ప్రకటించారని చెప్పారు. డ్వాక్రా రుణాలను కూడా నాలుగు సంవత్సరాల్లో రద్దు చేస్తామన్నారు. 45 సంవత్సరాలు నిండిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలకు సంబంధించి వారి కుటుంబాలకు లబ్ధి చేకూరే విధంగా నేరుగా వారి బ్యాంకు అకౌంట్‌లోనే 75 వేల రూపాయలు జమచేస్తామన్నారు. ఈ విధంగా చేయడంతో ఎటువంటి అవినీతి, లంచాలకు తావుండదన్నారు. ప్రస్తుత టీడీపీ పాలనలో రేషన్ కార్డు నుండి పింఛన్ల వరకు ప్రతి పనికి జన్మభూమి కమిటీ మొదలు ఎమ్మెల్యేల వరకు పథకానికో రేటు చొప్పున వసూలు చేస్తున్నట్లు ఆరోపించారు. ఎన్నికలు వస్తున్న తరుణంలోనే చంద్రబాబుకు బీసీలు గుర్తుకు వస్తాన్నారన్న ఆయన ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని పనిముట్ల కొనుగోలు పేరుతో 750 కోట్ల రూపాల ఖర్చు పేరుతో అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపించారు. ప్రతి పనిముట్టుకు వేల రూపాయల అధికాంగా చెల్లిస్తున్నట్లు కనిపిస్తోందన్నారు. ముఖ్యంగా చేనేతకు సంబంధించి జాకాడ్ లిఫ్టింగ్ యంత్రం మార్కెట్‌లో పదివేలకు లభిస్తుంటే కాంట్రాక్టర్‌కు మాత్రం 18500 రూపాయలను చెల్లిస్తున్నారని చెప్పారు. ఈ వ్యవహారంతో చంద్రబాబు ఎ కార్యక్రమం చేపట్టినా కూడా అంతా అవినీతిమయం అవుతుందని స్పష్టమైయిందన్నారు.