ఆంధ్రప్రదేశ్‌

గండికోటకు నీళ్లెప్పుడిస్తారు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప సిటీ, సెప్టెంబర్ 4: శ్రీశైలం, నాగార్జునసాగర్ జలాశయాలు పూర్తిగా నిండాయని, అయినా కడప జిల్లాలోని గండికోటకు నీళ్లిచ్చేందుకు ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోందని కడప మాజీ ఎంపీ అవినాష్‌రెడ్డి ఆరోపించారు. మంగళవారం కడపలో ఆయన విలేఖరులతో మాట్లాడుతూ కడప జిల్లాలో రాష్ట్రంలోనే అత్యంత తక్కువ వర్షపాతం నమోదైందన్నారు. 51 మండలాల్లో ఎక్కడా పదును వర్షం కూడా పడలేదన్నారు. శ్రీశైలం, సాగర్ నిండాయని, మరి కడప జిల్లాను ఆదుకునేందుకు గండికోటకు ఎప్పుడు నీళ్లిస్తారని ఆయన ప్రశ్నించారు. శ్రీశైలం బ్యాక్‌వాటర్ నుంచి ఎస్‌ఆర్‌బీసీ ద్వారా 2 వేల క్యూసెక్కుల నీరు తరలిస్తున్నారన్నారు. ఆ నీరు ఎప్పుడు అవుకు జలాశయం చేరాలి, అక్కడి నుండి గండికోటకు ఎప్పుడు రావాలంటూ ప్రశ్నించారు. వెలుగోడు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నుంచి కేసీ కెనాల్‌కు పలుచోట్ల లీకేజీలు ఉన్నాయని, దీంతో నీరు వృథాగా పోతోందన్నారు. లీకేజీలు అరికట్టాలని అన్నారు. శ్రీశైలం రిజర్వాయర్‌కు కేవలం వరద నీరే ఆధారమని, ఆ వరద కూడా కేవలం మూడునెలలు మాత్రమే ఉంటుందన్నారు.
అయినా ఇప్పటికీ గండికోటకు నీరు రాకపోవడంతో కడప జిల్లా రైతాంగం పరిస్థితి అగమ్యగోచరంగా తయారైందన్నారు. కడప జిల్లాకు కేవలం 600 క్యూసెక్కులు విడుదల చేస్తే గండికోట, బ్రహ్మంసాగర్, సోమశిల, సర్వారాయసాగర్ ప్రాజెక్టులు ఎప్పుడు నిండుతాయో ప్రభుత్వం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.