ఆంధ్రప్రదేశ్‌

మద్యం అమ్మకాలపై ఉండవల్లిది అసత్య ప్రచారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, సెప్టెంబర్ 4: మద్యం అమ్మకాల విషయంలో మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ రాష్ట్రప్రభుత్వంపై అసత్య ప్రచారానికి దిగారని పాయకారావుపేట టీడీపీ ఎమ్మెల్యే వంగలపూడి అనిత విరుచుకుపడ్డారు. తనకు తాను మేధావిగా భావిస్తూ ప్రజలను పక్కదారి పట్టించే పనులను ఉండవల్లి మానుకోవాలని హితవుపలికారు. మంగళవారం తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యాలయం ఎన్‌టిఆర్ భవన్‌లో మీడియాతో ఆమె మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిక తర్వాత మద్యం అమ్మకాలపై నియంత్రణకు కృషి చేస్తున్న విషయాన్ని గమనించాలని సూచించారు. వైఎస్ పాలనలో రాష్ట్రాన్ని మద్యాంధ్రప్రదేశ్‌గా మార్చారని, అప్పట్లో మద్యం ఆదాయాన్ని 3 వేల కోట్ల నుంచి 30 వేల కోట్ల రూపాయలకు పెంచిన విషయం మర్చిపోయారా అంటూ నిలదీశారు. వైఎస్ అండతో రాష్టమ్రంతా లక్షలాది బెల్టుషాపులు పుట్టగొడుగుల్లా వెలిశాయని, తెలుగుదేశం ప్రభుత్వం 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత బెల్టుషాపులను పూర్తిగా నిర్మూలించిందన్నారు. 2014లో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రూ.4,352 కోట్లుగా ఉన్న మద్యం ఆదాయం 2017 నాటికి రూ.4,644 కోట్లకు చేరి కేవలం రూ.300 కోట్లు మాత్రమే పెరిగిందని అన్నారు. మద్యం నియంత్రణకు ప్రభుత్వం అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటోందని, వైఎస్ హయాంలో ఏరులై పారుతున్నప్పుడు ఉండవల్లి అరుణ్‌కుమార్ ఎందుకు నోరు మెదపలేదని నిలదీశారు.
రాజకీయంగా తన ఉనికిని చాటుకునేందుకే ప్రభుత్వంపై ఉండవల్లి బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని, ఇప్పటికైనా మద్యం అమ్మకాలపై దుష్ప్రచారాన్ని మానుకోవాలని ఎమ్మెల్యే విజ్ఞప్తిచేశారు.