ఆంధ్రప్రదేశ్‌

భక్తులను తప్పుదోవ పట్టిస్తున్న మాడభూషి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, సెప్టెంబర్ 4: తిరుమల స్వామివారి సాక్షిగా కేంద్ర సమాచార కమిషనర్ మాడభూషి శ్రీ్ధర్ మరో కొత్తనాటకానికి తెర లేపారని, వెంకన్న భక్తులను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని టీడీపీ ఎమ్మెల్యే, టీటీడీ పాలకవర్గ సభ్యుడు బోండా ఉమామహేశ్వరరావు విమర్శించారు. స్వామివారి ఆభరణాలకు సంబంధించి తిరువాభరణం రిజిష్టర్‌ను 1952లో తయారు చేశారని, ఆ రిజిష్టర్ ప్రకారం ఆభరణాలు అన్నీ ఉన్నాయని జస్టిస్ జగన్నాథరావు కమిషన్ కమిటీ ఇప్పటికే స్పష్టం చేసిందని గుర్తు చేశారు. మంగళవారం టీడీపీ రాష్ట్ర కార్యాలయం ఎన్‌టిఆర్ భవన్‌లో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఎమ్మెల్యే బోండా ఉమా మాట్లాడుతూ శ్రీకృష్ణ దేవరాయకాలంలోని నగలు లేవంటూ మాడభూషి శ్రీ్ధర్ భక్తులను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారన్నారు. బీజేపీతో టీడీపీ విడిపోయిన తరువాత బురదజల్లే కార్యక్రమాలకు శ్రీ్ధర్ శ్రీకారం చుట్టారని ఆరోపించారు. గతంలో ఎందుకు ప్రశ్నించలేదని, ఇందులో కేవలం రాజకీయ కోణం దాగి ఉందని అన్నారు. ఆయన వ్యాఖ్యల వల్ల కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయని, గౌరవప్రదమైన హోదాలో ఉన్నారనే విషయాన్ని మరవడం మంచిది కాదన్నారు. గతంలో వైసీపీ, బీజేపీ రాయలసీమ డిక్లరేషన్ పేరుతో ఒకసారి, రమణ దీక్షితులను అడ్డం పెట్టుకుని రాజకీయం చేయాలని మరోసారి ప్రయత్నించి వైఫల్యం చెందాయన్నారు. వాటిని ప్రజలు తిరస్కరించిన నేపథ్యంలోనే కొత్తగా ఇప్పుడు ఈ నాటకానికి తెర లేపుతున్నారని విమర్శించారు. పవిత్రమైన తిరుమలకు రాజకీయాలు అంటకట్టడం సరికాదని, అత్యంత పారదర్శకంగా వ్యవహరిస్తున్న దేవస్థానం ప్రతిష్టను మసకబార్చేందుకు కుట్ర జరుగుతుందని ఎమ్మెల్యే బోండా ఉమా ఆందోళన వ్యక్తంచేశారు.