ఆంధ్రప్రదేశ్‌

టాటా క్యాన్సర్ ఆస్పత్రికి 25 ఎకరాలు ఎందుకు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, సెప్టెంబర్ 4: టాటా సంస్థ దేశంలో ఎక్కడైనా సేవాభావంతో కార్యక్రమాలు చేయడం లేదని, ఆ సంస్థ దృష్టంతా భూములపైనే ఉంటుందని తిరుపతిలో టాటా సంస్థ ఏర్పాటు చేస్తుందని చెబుతున్న కేన్సర్ ఆస్పత్రికి నిధులు కేంద్ర హోంశాఖ పరిధిలోని అటానమిక్ విభాగం నుంచి అందుతాయని, 25 ఎకరాల స్థలం టీటీడీ ఇచ్చిందని ఇక టాటా కేన్సర్ కోసం చేసే సేవ ఏమిటని మాజీ కేంద్ర మంత్రి డాక్టర్ చింతా మోహన్ ప్రశ్నించారు. అక్టోబర్ 2వ తేదీలోపు టాటాకిచ్చిన స్థలాన్ని టీటీడీ వెనక్కి తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. అలిపిరి మార్గంలో 25 ఎకరాల స్థలంలో శ్రీ వేంకటేశ్వర కేన్సర్ కేర్ అండ్ అడ్వాన్స్‌డ్ రీసెర్చ్ హాస్పిటల్‌కు ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, టాటా ట్రస్ట్ చైర్మన్ రతన్‌టాటాలు భూమిపూజ చేసిన విషయం విదితమే. ఈనేపథ్యంలో ఎస్సీ సెల్ రాష్ట్ర నాయకుడు పూతలపట్టు ప్రభాకర్ ఆధ్వర్యంలో మంగళవారం టీటీడీ పరిపాలనా భవనం ముందు మహిళలతో కలిసి ఆయన నిరసన కార్యక్రమం చేపట్టారు. అనంతరం తిరుపతి జేఈఓ పోలా భాస్కర్‌ను కలిసి తమ డిమాండ్లతో వినతిపత్రం అందించారు. ఈసందర్భంగా చింతా మోహన్ మాట్లాడుతూ టాటా సంస్థకు సుమారు రూ. 2వేల కోట్లు విలువచేసే అత్యంత విలువైన భూమిని టీటీడీ యాజమాన్యం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒత్తిడితో 25 ఎకరాలు కేటాయించడం దుర్మార్గమన్నారు. టీటీడీ పరిధిలో ఉన్న స్థలాలు సాక్షాత్తూ స్వామివారిదన్నారు. ఇలాంటి భూములను పలురకాల కారణాలను చూపుతూ వ్యాపారులకు ఇవ్వడం సరికాదన్నారు. కాగా అడయార్‌లో అపోలో ఆస్పత్రి మూడు ఎకరాల విస్తీర్ణంలోనే కేన్సర్ ఆస్పత్రిని ఏర్పాటు చేసిందన్నారు. అక్కడ కూడా పరిశోధనలు జరుగుతున్నాయన్నారు. అదే కేన్సర్ వైద్యానికి, పరిశోధనలకు 25 ఎకరాలు కేటాయించాల్సిన అవసరం ఏముందని ఆయన ప్రశ్నించారు. టాటా ఒక వ్యాపార సంస్థేనని, సేవా సంస్థ కాదని సామాన్యులకు సైతం తెలుసన్నారు. స్వామివారి సొత్తును దుర్వినియోగం చేస్తే తాము చూస్తూ ఊరుకోబోమన్నారు. తక్షణం భూమిపూజ చేసిన కేన్సర్ ఆస్పత్రికి ‘టాటా’ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.