ఆంధ్రప్రదేశ్‌

వినోదంతో పాటు వ్యాపారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, సెప్టెంబర్ 4: ప్రయాణికులకు మెరుగైన వసతులు కల్పిస్తూనే లాభసాటి వ్యాపారాలవైపు రైల్వే ఇపుడు దృష్టి సారిస్తోంది. సరకు రవాణా, ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చడం, వాణిజ్య ప్రకటనల ద్వారా వచ్చే ఆదాయంతో సంతృప్తి చెందని రైల్వే కోట్లాది రూపాయల ఆదాయాన్ని సులభంగా సంపాదించుకునే మార్గాలను అనే్వషిస్తోంది. ఇందులో భాగంగా పలు ఎక్స్‌ప్రెస్ రైళ్ళు, రైల్వేస్టేషన్లలో వ్యాపారం నిర్వహించాలని ఆలోచన చేస్తోంది. ఎక్స్‌ప్రెస్ రైళ్ళల్లో సుదూర ప్రాంతాల మధ్య ప్రయాణించే వారికి కాస్తంత కాలక్షేపం, వినోదాన్ని అందించే విధంగా ఆకర్షణీయ పథకాలు అమలు చేయాలని రైల్వే నిర్ణయించింది. వీటిపై నిపుణుల నుంచి సర్వే నివేదికలు తీసుకున్నట్టు తెలిసింది. వీటి ఆధారంగానే దేశంలో సుదూర ప్రాంతాల మధ్య నడిచే సూపర్‌ఫాస్ట్‌లు, ఎక్స్‌ప్రెస్ రైళ్ళల్లో షాపింగ్ సెంటర్లు నిర్వహించాలని ఆలోచన చేస్తోంది. గృహోపకరణ, అలంకరణ వస్తువులు, మహిళల అభరణాలు, చీరలు తదితర వాటితో నిర్వహిస్తారు. ఇందుకోసం ఎక్స్‌ప్రెస్ రైళ్ళల్లో ఒకటి, రెండు కోచ్‌లను కేటాయియించనుంది. నాలుగైదు రాష్ట్రాలను కలుపుతూ నడిచే కొన్ని ఎక్స్‌ప్రెస్ రైళ్లలో ప్రయోగాత్మకంగా షాపింగ్ సెంటర్లను నిర్వహించాలని నిర్ణయించిన రైల్వే చెన్నై, కోణార్క్, శతాబ్ది, గరీబ్థ్‌ల్రను ఎంపిక చేసినట్టు తెలిసింది. తొలుత వీటిల్లో లాభసాటి వ్యాపారాన్ని ప్రారంభించాక ప్రయాణికు ఆదరణ బట్టి మరికొన్ని రైళ్ళకు విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. అలాగే ప్రధాన రైల్వేస్టేషన్లలో బాడీ మాస్ ఇండెక్స్ (బీఎంఐ) కియోస్క్‌లు, ఫుట్ మసాజ్ రోబోటిక్, చైర్‌లు, మినీ ఎగ్జిబిషన్లు వంటివి నిర్వహించాలని కూడా యోచిస్తోంది. నిత్యం రద్దీగా ఉండే రైల్వేస్టేషన్లు, అధిక సంఖ్యలో రైళ్ళు రాకపోకలు సాగించే రైల్వే స్టేషన్లను గుర్తించి వాటిలో తొలుత వ్యాపార కేంద్రాలను ఏర్పాటు చేయాలనేది రైల్వే ఆలోచన. ఈస్ట్‌కోస్ట్ రైల్వేజోన్‌కు సంబంధించి విశాఖపట్నం, భువనేశ్వర్, పూరి, దక్షిణమధ్య రైల్వే పరిధిలో విజయవాడ, గుంటూరు, సికింద్రాబాద్, తిరుపతి వంటి రైల్వేస్టేషన్లలో మినీ ఎగ్జిబిషన్ల నిర్వహణకు రైల్వే ఆసక్తి చూపుతోంది. అయితే ఇటువంటి వాటిని కార్పొరేట్ సంస్థలకు అప్పగించడమా? రైల్వే ఆధ్వర్యంలోనే నిర్వహించాలా? అనే అంశాన్ని పరిశీలిస్తున్నట్టు తెలిసింది.