ఆంధ్రప్రదేశ్‌

ఆ మూడు పార్టీలకు బుద్ధి చెప్పాలి: సీపీఐ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిత్తూరు, సెప్టెంబర్ 5: రాష్ట్రంలో ప్రజల బతుకుల్ని కుంగదీసే బీజేపీ, టీడీపీ, వైకాపా, కాంగ్రెస్ పార్టీలకు తగిన గుణపాఠం చెప్పి, వచ్చే ఎన్నికల్లో నూతన శకానికి ప్రజలు నాంది పలకాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శ కె రామకృష్ణ పిలుపునిచ్చారు. వామపక్షాల ఆధ్వర్యంలో రాష్ట్రంలో కొనసాగుతున్న బస్సు యాత్ర బుధవారం చిత్తూరుకు చేరుకుంది. ఈసందర్భంగా ఏర్పాటు చేసిన సభలో రామకృష్ణ మాట్లాడుతూ గత నాలుగేళ్లుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని విధాలుగా వైఫల్యం చెందాయని ఆరోపించారు. వామపక్షాలు తమ శక్తి మేర ప్రజల హక్కులను కాపాడుతున్నాయన్నారు. భిన్నమైన విధానాలతో అన్ని వర్గాల వారికి న్యాయం జరగాలంటే రాష్ట్రంలో ప్రత్యామ్నాయ పాలన అవసరమన్నారు. ఎన్నికల్లో ఈ పార్టీలకు తగిన గుణపాఠం చెప్పి వామపక్ష పార్టీలకు అవకాశం కల్పించాలన్నారు. రాష్ట్రంలో రైతులు సంతోషంగా లేరని, ఎక్కడ చూసినా ఎండిన పంటలే దర్శనమిస్తున్నాయన్నారు. కృష్ణా డెల్టా ప్రాంతాలను చూసి రాష్టవ్య్రాప్తంగా రైతులు సంతోషంగా ఉన్నారని టీడీపీ నేతలు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. నేడు కరవు మండలాలను ప్రభుత్వం ప్రకటించిందే కాని ప్రత్యామ్నాయ మార్గాలను చూపలేదన్నారు. చిత్తూరు జిల్లాలో మామిడి రైతుల బతుకులు ప్రశ్నార్ధకంగా మారాయన్నారు. ముఖ్యమంత్రి సొంత జిల్లాలో ఉన్న సహకార డెయిరీ, ఇతర సహకార చక్కెర ఫ్యాక్టరీలు మూతపడటంతో రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారన్నారు.