ఆంధ్రప్రదేశ్‌

కడప ఉక్కుపై దోబూచులాట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప, సెప్టెంబర్ 5: విభజన బిల్లులో పేర్కొన్న కడప జిల్లాకు ఉక్కు పరిశ్రమ అంశం రాజకీయ పార్టీల ప్రచారానికి మాత్రమే పనికి వస్తోంది. ఉక్కు పరిశ్రమపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దోబూచులాడుతున్నాయి. కేంద్ర ఉక్కు పరిశ్రమశాఖ మంత్రి, రాష్ట్ర ముఖ్యమంత్రి, ఇతర మంత్రులు ఉక్కు పరిశ్రమపై ప్రకటనలకే పరిమితమయ్యారు. కడప ఉక్కుపై కేంద్రానికి సీఎం ఇచ్చిన రెండు నెలల గడువు ముగిసింది. అయితే కేంద్రం నుంచి ఎలాంటి స్పందన లేకపోగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా ఫ్యాక్టరీపై ఎలాంటి ప్రకటన రాలేదు. ఉక్కు పరిశ్రమపై ప్రకటన చేయాలని రెండు నెలల క్రితం రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్‌నాయుడు, ఎమ్మెల్సీ ఎం.రవీంద్రనాథరెడ్డి(బీటెక్ రవి) కడపలో నిరవధిక నిరాహారదీక్ష చేపట్టిన సంగతి తెలిసిందే. వారి నిరాహారదీక్ష విరమింపచేసేందుకు సాక్ష్యాత్తు ముఖ్యమంత్రి జిల్లాకు వచ్చారు. జూలై 1వ తేదీ నిరాహారదీక్ష విరమణ సమయంలో కేంద్రానికి రెండు నెలలు గడువు ఇస్తున్నామని సీఎం అల్టిమేటం ఇచ్చారు. రెండు నెలల్లోపు కేంద్ర ప్రభుత్వం ఉక్కు పరిశ్రమపై ప్రకటన చేయకపోతే, రాష్ట్ర ప్రభుత్వమే స్థాపిస్తుందని ఘంటాపథంగా చెప్పారు. రెండునెలల గడువు ముగిసిపోయింది. కేంద్రం నుండి ఎలాంటి ప్రకటనా వెలువడలేదు. కేంద్రంపై రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన వత్తిడి ఏమిటో ప్రజలకు తెలియదు. జిల్లాకు చెందిన బీజేపీ సీనియర్ నేతలు మాత్రం ఉక్కు పరిశ్రమకు ప్రధాన మంత్రి శంకుస్థాపన చేస్తారని అంటున్నారు. ఆగస్టు 27న కేంద్ర ఉక్కుశాఖ మంత్రి బీరేందర్ సింగ్ ఒక ప్రకటన జారీ చేస్తూ స్టీల్ దిగ్గజం విట్టల్‌తో కలిసి సెయిల్ సంస్థ గుజరాత్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌లో ఉక్కు పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు ఒక అంగీకారానికి వచ్చినట్లు పేర్కొన్నారు. అయితేపరిశ్రమ ఎక్కడ స్థాపిస్తారన్నది స్పష్టం చేయలేదు. అంతకుముందు సెయిల్ సంస్థ ఇప్పట్లో కడపలో ఉక్కు పరిశ్రమ స్థాపన ఫీజబులిటీ కాదని నివేదిక ఇచ్చినట్లు చెప్పిన కేంద్రమే, ఇప్పుడు విట్టల్, సెయిల్ సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో మూడు రాష్ట్రాల్లో ప్లాంట్లు నిర్మాణం జరుగుతాయని చెప్పడం గమనార్హం. కేంద్రానికి ముఖ్యమంత్రి ఇచ్చిన రెండు నెలల గడువు తీరిపోయినా ఆయన ఈ విషయంలో నోరుమెదపడం లేదు. ఉక్కు పరిశ్రమ వచ్చేంతవరకు గడ్డం తీయనని ప్రతిజ్ఞ చేసిన రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ గడ్డంతో జిల్లాలో పర్యటిస్తున్నారు. ఉక్కు పరిశ్రమ వస్తుందన్న ఆశ ప్రజల్లో ఏకోశానా కనిపించడం లేదు.