ఆంధ్రప్రదేశ్‌

ప్రజలు పిట్టల్లా రాలిపోతున్నా పట్టించుకోరా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, సెప్టెంబర్ 16: గత మూడు నెలలుగా మన్యం, మైదాన ప్రాంతం అనే తేడా లేకుండా తీవ్రమైన విషజ్వరాలు, డెంగ్యూ వల్ల పసిపిల్లలు, పెద్దలు పిట్టల్లా రాలిపోతున్నా రాష్ట్ర ప్రభుత్వం కనీసం పట్టించుకోకపోవడం అన్యాయమని లోక్‌సత్తా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు భీశెట్టి బాబ్జీ విమర్శించారు. నగరంలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఆదివారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో ఎవ్వరూ ఊహించని, ఎప్పుడూ తెలియని స్థాయిలో జ్వరాలు ప్రబలాయని తెలిపారు. ప్రైవేట్, ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగులు వేల సంఖ్యలో ఉన్నారని, ప్రైవేట్ ఆసుపత్రుల్లో అడ్డగోలు దోపిడీ జరుగుతోందని, అయినా ప్రభుత్వం నుండి ఎలాంటి చర్యలు లేవన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో వౌలిక సదుపాయాలున్నా సిబ్బంది లేక రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ఉత్తరాంధ్రలో ఆరోగ్య అత్యయిక పరిస్థితి ప్రకటించాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్రానికి వెంటనే వైద్య ఆరోగ్య శాఖ మంత్రిని నియమించాలని ఆయన ముఖ్యమంత్రిని కోరారు. విలేఖరుల సమావేశంలో పార్టీ నాయకులు పూర్ణచంద్రరావు, రవితేజ, సుబ్బారావు, లక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.