ఆంధ్రప్రదేశ్‌

పాములు, కుక్కల బెడదపై అసెంబ్లీలో సభ్యుల ఆందోళన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, సెప్టెంబర్ 17: కోనసీమలో పాములు, విశాఖలో కుక్కల బెడదతో ప్రజలంతా భయభ్రాంతులకు గురవుతున్నారని శాసనసభలో సోమవారం జరిగిన ప్రశ్నోత్తరాల్లో తెలుగుదేశం సభ్యులు ఆలపాటి రాజేంద్రప్రసాద్, గొల్లపల్లి సూర్యారావు, రమేష్‌బాబు, బీజేపీ ఫ్లోర్‌లీడర్ పెనె్మత్స విష్ణుకుమార్ రాజు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో పాము విషం విరుగుడు మందుల కొరత ఉందా అని తొలుత ఆలపాటి ప్రశ్నించగా, ఆరోగ్య శాఖ తరపున ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు స్పందిస్తూ కొరత లేదని బదులిచ్చారు. చిన్న ఆసుపత్రుల్లో, 108 అంబులెన్సుల్లోనూ అందుబాటులో ఉంచాలని సూచించారు. గొల్లపల్లి సూర్యారావు మాట్లాడుతూ కోనసీమ గ్రామాల్లో పాముల బెడద ఎక్కువగా ఉందని, అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోనూ మందులు అందుబాటులో ఉంచాలన్నారు. విష్ణుకుమార్ రాజు మాట్లాడుతూ విశాఖ నగరంలో కుక్కల బెడద ఎక్కువగా ఉందన్నారు. దోమలపై దండయాత్ర సరేనని, ప్రజలు భయభ్రాంతులకు గురికాకుండా సుఖసంతోషాలతో ఉండాలంటే కుక్కలపై దండయాత్ర చేయాలని సూచించారు. రమేష్‌బాబు మాట్లాడుతూ విశాఖ గ్రామీణ ప్రాంతంలో పాముకాటు బాధితులు చనిపోతున్నారని, ఆసుపత్రుల్లో సకాలంలో వైద్యం అందేలా చూడాలన్నారు. మంత్రి యనమల కల్పించుకుంటూ పట్టణాల్లో కుక్కల బెడద నివారణకు మంత్రి నారాయణ చర్యలు తీసుకుంటారని చెప్పారు.