ఆంధ్రప్రదేశ్‌

దేవాన్ష్ అదృష్టం ఇతర చిన్నారులకు లభిస్తుందా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, సెప్టెంబర్ 17: శాసనసభ ప్రశ్నోత్తరాల్లో పోలవరం అంశంపై సోమవారం దాదాపు అరగంట సేపు రసవత్తర చర్చ జరిగింది. మంత్రి దేవినేని ఉమా ఓ సందర్భంగా ఇటీవల జరిగిన గ్యాలరీ వాక్‌ను ప్రస్తావిస్తూ ఈ వాక్‌ను జగన్ మీడియా పిక్నిక్‌గా ప్రచారం చేయటం శోచనీయమన్నారు. నాగార్జునసాగర్‌కు అప్పటి ప్రధాని నెహ్రూ శంకుస్థాపన చేస్తే ఆపై కుమార్తె ఇందిరాగాంధీ స్పిల్‌వే వాక్ నిర్వహించారని అయితే చంద్రబాబు పనులు చేపట్టి పూర్తి వాక్ నిర్వహించిన యుగపురుషుడంటూ అభినందించారు. బీజేపీ ఫ్లోర్ లీడర్ పెనె్నత్స విష్ణుకుమార్ రాజు ఓ వైపు పొగుడుతూనే ఆ వాక్ ఎంత చారిత్రాత్మకం అనగా సభ్యులు బల్లలు చరిచారు. ఆ తర్వాత ముఖ్యమంత్రి మనవడు దేవాన్ష్ కూడా వాక్ చేశారు.. అంతటి అదృష్టం ఇతర చిన్నారులకు లభించడం సాధ్యమేనా.. ఎందుకంటే దానికి తాత సీఎం... తండ్రి మంత్రి కావాలి కదా అంటూ చురకలు వేయగా టీడీపీ సభ్యులు విస్తుపోయారు.
ఆక్వా రైతుల విద్యుత్ రీయింబర్స్‌మెంట్ జీవో మార్చాలి
ఆక్వాసాగు రైతులకు ఉపయోగకరంగా లేని విద్యుత్ రీయింబర్స్‌మెంట్ జీవో మార్చాలని శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ ప్రభుత్వాన్ని కోరారు. సోమవారం జరిగిన శాసనసభ ప్రశ్నోత్తరాల్లో ఎమ్మెల్యే గద్దె ఇటీవల ప్రభుత్వం విడుదల చేసిన ఆక్వారంగ రైతుల విద్యుత్ రీయింబర్స్‌మెంట్ జీవోలోని అంశాలపై ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రాలోని 13 జిల్లాల్లో ఆక్వా ఇండస్ట్రీ చాలా కీలకపాత్ర పోషిస్తోందన్నారు. ఆక్వా ఇండస్ట్రీ వృద్ధి రేటులో ప్రభుత్వం కూడా ప్రత్యేక్షంగా పరోక్షంగా సాయం చేస్తూ రైతులకు చాలా సహాయకారిగా ఉందన్నారు. ఇటీవల ప్రభుత్వం జారీ చేసిన ఆక్వా రంగ రైతుల కరెంట్ రీయింబర్స్‌మెంట్ జీవో వారికి ఏ మాత్రం ఉపయోగపడడం లేదని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లారు. సంబంధిత మంత్రివర్యులు ఈ జీవో మీద దృష్టి సారించి తక్షణమే జీవోలో మార్పులు చేయాలని కోరారు. ఈ విషయంపై మార్కెటింగ్ శాఖ మంత్రి సీహెచ్ ఆదినారాయణరెడ్డి సానుకూలంగా స్పందించారు. శాసనసభ్యులు గద్దె ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చిన విధంగా తక్షణమే జీవోలోని లోటుపాట్లు సరి చేసి ఆక్వా రైతులకు మేలు చేకూరే విధంగా చర్యలు తీసుకుంటామని అన్నారు. మరో శాసనసభ్యులు వీవీ శివరామరాజు మాట్లాడుతూ విద్యుత్ రాయితీని బిల్లులోనే తగ్గించాలన్నారు. రీయింబర్స్‌మెంట్ విధానంలో చెల్లిస్తే ఇబ్బందులు వచ్చే అవకాశం ఉందన్నారు. నాణ్యమైన సీడ్ సరఫరా చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. మంత్రి ఆదినారాయణరెడ్డి బదులిస్తూ విద్యుత్ రాయితీ నేరుగా బిల్లులో వచ్చేలా ప్రతిపాదనలు తయారు చేస్తామన్నారు.
చిత్తూరులో స్కిల్ డెవలప్‌మెంట్ వర్సిటీ
చిత్తూరులో స్కిల్ డెవలప్‌మెంట్ వర్సిటీ ఏర్పాటును పరిశీలిస్తున్నట్లు రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి అమరనాథ్‌రెడ్డి తెలిపారు. చిత్తూరు శ్రీసిటీలో ఏర్పాటైన పరిశ్రమలు, కల్పించిన ఉద్యోగాల సంఖ్యపై శాసనమండలిలో సోమవారం ఎమ్మెల్సీలు విఠపు బాల సుబ్రహ్మణ్యం, తదితరులు అడిగిన ప్రశ్నకు మంత్రి బదులిస్తూ, 93 పరిశ్రమలు ఏర్పాటయ్యాయని, అందులో 28 వేల మందికి ఉపాధి కల్పించామని తెలిపారు. అందులో 24 వేల మంది స్థానికులని తెలిపారు. దీనిపై ఎమ్మెల్సీ వై.శ్రీనివాసులు రెడ్డి స్పందిస్తూ, స్థానికులకు ఉపాధి సరిగా కల్పించలేదన్నారు. మంత్రి ఇచ్చిన వివరాల్లో పొరపాటుగా నమోదైనట్లు తెలిపారు. ఎమ్మెల్సీ విఠపు బాల సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ స్థానికులు అంటే ఎవరు అని ప్రశ్నించారు. భూములు కోల్పోయిన వారు స్థానికులని, ఏపీలో ఉన్న వారు కాదన్నారు. స్థానికులను అన్‌స్కిల్డ్ కార్మికులుగా, స్కిల్డ్ కార్మికులను తమిళనాడు, ఒడిశా నుంచి తీసుకుని వస్తున్నారని తెలిపారు. ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ మాట్లాడుతూ కార్మికుల కోసం వర్కింగ్ హాస్టళ్లను ఏర్పాటు చేయాలని సూచించారు. దీనిపై మంత్రి స్పందిస్తూ, స్కిల్ డెవలప్‌మెంట్ వర్సిటీ ఏర్పాటు ప్రతిపాదన పరిశీలిస్తున్నామన్నారు. ఆయా పరిశ్రమలకు అవసరమైన విధంగా శిక్షణ ఇస్తామన్నారు.