ఆంధ్రప్రదేశ్‌

గ్రూపులు మానండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, సెప్టెంబర్ 17: ఈ ఐదు నెలలు కీలకం..ప్రజలతో నిరంతరం మమేకం కావాలి.. కలసికట్టుగా పనిచేస్తేనే ఫలితాలు.. గ్రూపు విభేదాలకు స్వస్తిచెప్పండని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఉద్బోధించారు. సోమవారం రాత్రి ఉండవల్లి గ్రీవెన్స్‌హాల్‌లో విజయనగరం జిల్లా నేతలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. విజయనగరం మంచి జిల్లా.. అక్కడి ప్రతిపక్షమే చెడు.. చెడు నుంచి ప్రజలను కాపాడాల్సిన బాధ్యత టీడీపీ నేతలదే అన్నారు. 2014కు ముందు పదేళ్లలో జిల్లా పరిస్థితులను గుర్తుంచు కోవాలన్నారు. బొత్స సత్యనారాయణ అరాచకాలను ప్రజలు ఇంకా మరచిపోలేదన్నారు. సమైక్యాంధ్ర పోరాటంలో ఉద్యమించిన ప్రజలపై అప్పట్లో బొత్స సృష్టించిన భయోత్పాతం, నాటి కాంగ్రెస్ ప్రభుత్వం కర్ఫ్యూ విధించడం విజయనగరం చరిత్రలో ఎన్నడూ లేదన్నారు. అలాంటి పరిస్థితులు జిల్లాలో పునరావృతం కారాదన్నారు. గత నాలుగేళ్లలో విజయనగరం జిల్లాలో గణనీయమైన అభివృద్ధి సాధించాం.. చేసిన అభివృద్ధి కార్యక్రమాలన్నింటినీ బృందాలుగా పార్టీ నేతలు క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపి ప్రజల్లో విస్తృత ప్రచారం చేయాలన్నారు. అభివృద్ధి కార్యక్రమాలపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలని సూచించారు. జలవనరుల అభివృద్ధి, ఆర్థిక పురోగతి, వౌలిక వసతులు, సంక్షేమం ఈ నాలుగింటిని ప్రజలకు వివరించి చైతన్యవంతులు చేయాలని ఆదేశించారు. జిల్లాలో గడ్డలపై (వాగులు) చెక్‌డ్యామ్‌లు నిర్మిస్తే అవి చెరువులుగా మారతాయని వ్యవసాయంలో విజయనగరం జిల్లా ముందంజలో ఉండాలనేదే ప్రభుత్వ లక్ష్యమన్నారు. అర్హులైన అందరికీ సంక్షేమ పథకాలు అందేలా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. భూ సేకరణ ఉభయతారకంగా ఉండాలన్నారు. ప్రభుత్వానికి రైతుల్లో మంచి పేరుతేవాలన్నారు. సంక్షేమంలో సంతృప్తి అనుకున్న స్థాయిలో ఉంది.. ఇలాంటప్పుడు ఎవరినీ ఇబ్బంది పెట్టొద్దని హితవు పలికారు. జిల్లాలోని అన్ని సీట్లలో పార్టీ ఘన విజయం సాధించే దిశగా కార్యాచరణ రూపొందించుకోవాలని సూచించారు. గ్రూపు విబేధాలను విడనాడి సీనియర్లు కార్యకర్తలకు అందుబాటులో ఉండాలన్నారు. అశోక్ గజపతిరాజు ఒక్క ఫోన్‌కాల్‌తో స్పందించి కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేశారని గుర్తుచేశారు. అదే స్ఫూర్తి అందరిలో ఉండాలన్నారు. పార్టీ పట్ల అంకితభావం పెంచుకోవాలన్నారు. సమావేశంలో ఏపీ టీడీపీ అధ్యక్షుడు కిమిడి కళా వెంకట్రావు, మంత్రి సుజయకృష్ణ రంగారావు, ఎంపీ అశోక్ గజపతిరాజు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ బాధ్యులు పాల్గొన్నారు.