ఆంధ్రప్రదేశ్‌

9 నుంచి పాఠశాలలకు దసరా సెలవులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, సెప్టెంబర్ 17: రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు దసరా సెలవుల తేదీలను రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ప్రకటించింది. అక్టోబర్ 9 నుంచి 21 వరకూ సూళ్లను మూసి వేయనున్నారు. ఈ సంవత్సరం అక్టోబర్ 17న దుర్గాష్టమి, 18న మహర్నవమి, 19న విజయదశమి, 21 ఆదివారం కావడంతో 22న పాఠశాలలను పునఃప్రారంభం అవుతాయి. సెలవు రోజుల్లో పాఠశాలలను నడపవద్దని ప్రభుత్వం హెచ్చరించింది. దీంతో విద్యార్థులకు ఈ సారి 13 రోజుల దసరా సెలవులు వచ్చాయి.

ఆర్టీసీలో ఇక అన్ని స్థాయిల్లో ఈ- టెండర్ విధానం అమలు

విజయవాడ, సెప్టెంబర్ 17: ఏపీఎస్ ఆర్టీసీలో ఇకపై అన్ని కొనుగోళ్లు పారదర్శకంగా ఈ- టెండర్ విధానంలో జరపనున్నారు. సంస్థ అవసరాలకు అనుగుణంగా ప్రతి సంవత్సరం రూ. 3వేల కోట్లు పైబడి స్పేర్ పార్ట్స్, టైర్స్, ఆయిల్, బస్సులను కొనుగోలు చేస్తోంది. ప్రస్తుతం ఈ కొనుగోళ్లు అన్ని పలు రకాల టెండర్ ప్రక్రియల్లో జరుగుతున్నాయి. సంస్థ ఎండీ పీ సురేంద్రబాబు నిర్దేశించిన విధంగా ఇక ముందు అంచెల వారీగా కొనుగోళ్లు అన్నీ ఈ- టెండర్ ప్రక్రియ ద్వారా చేస్తామని సోమవారం జరిగిన సమీక్షలో సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ జీ జయరావు తెలిపారు. జూలై 2018 నెలలో ప్రథమంగా ఈ- టెండర్ ప్రక్రియ ద్వారా 63 బస్సుల కొనుగోలుకు అనుమతి పత్రం జారీ చేశామన్నారు. ఇక ముందు సంస్థతో వ్యాపార లావాదేవీలు చేసే వారందరూ ఈ- టెండర్ ప్రక్రియ ద్వారానే నిర్వహించాల్సి ఉంటుందన్నారు.

సంక్షేమం ఆగదు

అమరావతి, సెప్టెంబర్ 17: పేదలకు తమ ప్రభుత్వం తోడుగా ఉంటుందని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వెల్లడించారు. అర్హులందరికీ న్యాయం జరగాలనేదే ప్రభుత్వ సంకల్పమన్నారు. సమాజంలో మహిళల పట్ల వివక్ష ఇంకా కొనసాగుతోందనే ఉద్దేశ్యంతోనే సంక్షేమ పథకాలు వారి పేరిట మంజూరు చేస్తున్నామని రాష్ట్రం ఆర్థికలోటులో ఉన్నప్పటికీ సంక్షేమం ఆగదని స్పష్టంచేశారు. శాసనసభలో సోమవారం చంద్రన్న సంక్షేమ పథకాలపై లఘు చర్చ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ పేదవారికి చక్కెర అదనంగా అందించేందుకు ప్రభుత్వంపై రూ 300 కోట్ల అదనపు భారం పడుతోందన్నారు. సంక్రాంతి, రంజాన్, క్రిస్మస్ కానుకలతో పాటు ఎన్టీఆర్ భరోసా కింద 50 లక్షల మంది పింఛన్లు పొందుతున్నారని తెలిపారు. చంద్రన్న బీమా సదుపాయం లేకపోతే కొన్నివేల కుటుంబాలు వీధిన పడేవన్నారు. ఈ పథకం కింద ప్రమాద మరణానికి రూ 5లక్షలు, సహజ మరణానికి రూ 2లక్షలు అందిస్తున్నట్లు చెప్పారు. అన్న కేంటీన్ల ద్వారా అతిథి మర్యాదలతో భోజన సదుపాయం కల్పిస్తున్నామని వివరించారు. చంద్రన్న పెండ్లి కానుకతో పాటు వచ్చేనెల 2వ తేదీ నుంచి యువనేస్తం కింద నిరుద్యోగ భృతి కల్పిస్తామన్నారు. ఎస్సీ, ఎస్టీలకు వంద యూనిట్ల ఉచిత విద్యుత్ సదుపాయం కొనసాగుతుందన్నారు. వైద్య, ఆరోగ్య రంగంలో సర్వీస్ ప్రొవైడర్ల ద్వారా పేదవాళ్లకు ఆరోగ్య భద్రత కల్పిస్తున్నామని చెప్పారు. చంద్రన్న పెళ్లికానుక దరఖాస్తు గడువును పదిరోజులుగా నిర్ణయించామని, కులాంతర వివాహాలకు ప్రోత్సాహం ఉంటుందన్నారు. అహంకారం వల్లే నల్గొండ జిల్లాలో ప్రేమ వివాహం చేసుకున్న యువకుడ్ని మట్టుపెట్టారని ఆవేదన వ్యక్తంచేశారు. సంప్రదాయంగా భావించి బాల్యవివాహాలు చేయటం అనర్థానికి హేతువన్నారు. చంద్రన్న పెళ్లికానుక పథకాన్ని అగ్రకులాల్లో పేదలకు వర్తింపచేసే అంశాన్ని పరిశీలించి త్వరలో నిర్ణయం తీసుకుంటామని బీజేపీ ఫ్లోర్‌లీడర్ విష్ణుకుమార్‌రాజు చేసిన ప్రతిపాదనపై స్పందించారు. నిరాడంబరంగా పెళ్లిళ్లు చేసుకోవటం వల్ల ఆర్థిక ఇబ్బందులు ఉండవని హితవు పలికారు. వచ్చేనెలలో డ్వాక్రా సంఘాలకు పసుపు కుంకుమ కింద మిగిలిన రూ 2వేలు మంజూరు చేస్తామని ప్రకటించారు. మహిళలకు విద్యా, ఉపాధి అవకాశాల్లో 33.5 శాతం రిజర్వేషన్ వర్తింప చేస్తున్నామని వారి ఆర్థిక స్వావలంబనకు అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

పవర్ లిఫ్టర్ అనూషకు
సీఎం అభినందన

విజయవాడ, సెప్టెంబర్ 17: దక్షిణాఫ్రికాలో జరిగిన వరల్డ్ పవర్ లిఫ్టింగ్ జూనియర్ చాంపియన్‌షిప్ పోటీల్లో రజత పతకం సాధించిన డొంకెన అనూషను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభినందించారు. అసెంబ్లీ ఆవరణలో సోమవారం ఆమెను ముఖ్యమంత్రి అభినందించి, 10 లక్షల రూపాయల పారితోషికం ప్రకటించారు. తాను సాధించిన వివిధ పతకాలను సీఎంకు ఆమె చూపించారు. కామనె్వల్త్ క్రీడల్లో బంగారు పతకం సాధనే లక్ష్యంగా కృషి చేస్తున్నానని తెలిపారు.
విశ్వకర్మకు సీఎం పుష్పాంజలి

విజయవాడ, సెప్టెంబర్ 17: దేవశిల్పి, వృత్తిదార్ల ఆరాధ్యుడు విశ్వకర్మకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సోమవారం పుష్పాంజలి అర్పించారు. కార్మిక వర్గాల శ్రేయస్సును విశ్వకర్మ ఆకాంక్షించారన్నారు. ఆయన దేవశిల్పి మాత్రమ కాదని, స్వర్ణకారులు, వడ్రంగులు, కంచర్లు, శిల్పులు, కమ్మర వృతిదార్లకు దారి చూపిన మహోన్నతునిగా, సృష్టికర్త పూజలు అందుకుంటున్నారన్నారు. హైందవ భవనాలకు రూపశిల్పిగా వేదాలు వర్ణిస్తున్నాయన్నారు.

కేరళ వరద బాధితులకు రూ.5 లక్షల విరాళం

విజయవాడ, సెప్టెంబర్ 17: కేరళ వరద బాధితులకు 5 లక్షల రూపాయలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఆంధ్ర మోటార్ మర్చంట్స్ అసోసియేషన్ ప్రతినిధులు సోమవారం అందచేశారు. ఉండవల్లిలోని సీఎం నివాసంలో విజయవాడ మేయర్ శ్రీ్ధర్‌తో కలిసి ఆ అసోసియేషన్ అధ్యక్షుడు సుబ్బారావు తదితరులు సీఎంను కలిశారు. కేరళకు సాయం అందించడంలో ఏపీ ముందుందని, ఆ స్ఫూర్తితో విరాళం అందిస్తున్నామన్నారు.
సరుకులు తీసుకోని వారికి ఫోన్ ద్వారా సమాచారం

విజయవాడ, సెప్టెంబర్ 17: రేషన్ దుకాణాల ద్వారా ప్రతి నెల 1 నుంచి 15 వరకూ సరుకులు పంపిణీ చేస్తున్నారు. ఆగస్టులో 87.03 శాతం మంది సరుకులను తీసుకువెళ్లగా, ఈ నెల 86.96 శాతం మంది మాత్రమే సరుకులు తీసుకువెళ్లారు. దాదాపు 28 వేల మంది గత నెలతో పోలిస్తే, ఈ నెల సరుకులు తీసుకు వెళ్లలేదు. దీంతో వారు సరుకులు తీసుకువెళ్లేందుకు వీలుగా ఈ నెల 18 నుంచి మూడు రోజులపాటు సరుకులను పంపిణీ చేయాలని నిర్ణయించినట్లు రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. అటువంటి వారికి ఫోన్ ద్వారా సమాచారం తెలియచేస్తామన్నారు.
మోదీపై విమర్శలు మానుకోవాలి: సోము
విజయవాడ (క్రైం), సెప్టెంబర్ 17: ముఖ్యమంత్రి చంద్రబాబుకు, ప్రధాని మోదీకి నక్కకు, నాగలోకానికి ఉన్నంత తేడా ఉందని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు అన్నారు. పాలన కోసం తల్లిని, కుటుంబాన్ని పక్కన పెట్టిన ప్రధాని నరేంద్రమోదీపై విమర్శలు చేయడం మానుకోవాలని హితవు చెప్పారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద సోమవారం ఆయన మాట్లాడుతూ దేశ రాజకీయ పరిస్థితిని భ్రష్టు పట్టిన పరిస్ధితుల్లో బాగు చేసేందుకు మోదీ ప్రయత్నిస్తుంటే విమర్శలు చేయడం సరికాదన్నారు. కొండవీటి వాగు జాతికి అంకితం చేస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు అవాస్తవాలన్నారు. కేసుల్లో కోర్టుకు హాజరుకాకపోతే అరెస్టు వారెంట్లు వస్తాయన్న విషయం ఇంత రాజకీయ అనుభవం కలిగిన చంద్రబాబుకు తెలియదా అని ప్రశ్నించారు. బాబ్లీ విషయంలో కాంగ్రెస్ వారు కేసులు పెడితే బీజేపీకి ఏమి సంబంధం అని ప్రశ్నించారు. చంద్రబాబే కోర్టుల్లో కేసులు మేనేజ్ చేసుకుంటున్నారని ఆరోపించారు. ఇప్పటికైనా అబద్ధాలు మాని వాస్తవంలోకి రావాలని అప్పుడే రాష్ట్రం అభివృద్ధి చెందుతున్నారు.
ప్రభుత్వం దమనకాండ సాగిస్తోంది
రాజధాని చుట్టు ప్రక్కల ప్రాంతాల్లో ప్రభుత్వం దమనకాండ సాగిస్తోందని బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ అన్నారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడుతూ లంక గ్రామాల ప్రజలను హౌస్ అరెస్టు చేస్తున్నారని, రాజధాని గ్రామాల్లో లంక భూముల ప్యాకేజీ విషయంలో ఆందోళన చేస్తున్న దళితులకు అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. ప్యాకేజీ విషయంలో గోల్‌మాల్ జరిగిందని అరోపించారు.

సీఎంకు కృతజ్ఞతలు

విజయవాడ, సెప్టెంబర్ 17 : తమను రెగ్యులరైజ్ చేస్తామని ప్రకటించినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు ఏపీ కాంట్రాక్టు వైద్యుల సంఘం సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. అసెంబ్లీ ఆవరణలో ఆరోగ్య శాఖ ముఖ్యకార్యదర్శి పూనం మాలకొండయ్య నేతృత్వంలో డాక్టర్ల సంఘం ప్రతినిధులు సోమవారం సీఎంను కలిశారు. సీఎం తీసుకున్న నిర్ణయం వల్ల దాదాపు 8000 మంది రెగ్యులరైజ్ కానున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో 5 వేల మంది, పట్టణ ప్రాంతాల్లో 3000 మందికి ప్రయోజనం చేకూరనుంది.