ఆంధ్రప్రదేశ్‌

కరవు జిల్లాలో మరో 50 అదనపు పనిదినాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, సెప్టెంబర్ 17: కరవు జిల్లాల్లో అదనంగా మరో 50 రోజులు పనిదినాలు కల్పించాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదేశించారు. నీరు- ప్రగతి, వ్యవసాయంపై జిల్లా కలెక్టర్లు, వివిధశాఖల అధికారులతో సోమవారం ముఖ్యమంత్రి టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. కరవు ప్రాంతాల్లో మొత్తంగా 150రోజుల పనిదినాలు కల్పించాలని రానున్న మూడు నెలల్లో మెటీరియల్ ఖర్చుపై శ్రద్ధ చూపాలన్నారు. అన్ని జిల్లాల్లో మెటీరియల్ ఎక్స్‌పెండిచర్ నిధులు ఖర్చు చేయాలన్నారు. రాబోయే 15 రోజులు స్వచ్ఛాంధ్ర పనులను వేగవంతం చేయాలని సూచించారు. ఇప్పటి వరకు మూడువేల షెడ్ల నిర్మాణం జరిగిందని, మిగిలిన వాటిని త్వరితగతిన పూర్తిచేయాలని నిర్దేశించారు. మరుగుదొడ్ల నిర్మాణంతో పాటు వాటిని వినియోగించుకునే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. అన్ని ప్రాంతాల్లో పారిశుద్ధ్యంపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలని ఆదేశించారు. మురుగునీటి నిల్వ లేకుండా చూడాలన్నారు. డ్రోన్ల ద్వారా అపారిశుద్ధ్య ప్రాంతాలను గుర్తించాలని యాంటీ లార్వా ఆపరేషన్లు నిర్వహించాలని సూచించారు. మురుగు నిల్వలు ఎక్కడా పేరుకుపోకుండా చర్యలు చేపట్టాలన్నారు. డ్రెయిన్లను ఎప్పటికప్పుడు శుభ్రపరుస్తూ ఫాగింగ్‌ను ముమ్మరం చేసే దిశగా కార్యాచరణ రూపొందించాలన్నారు. స్వచ్ఛ్ధార వాహనాలను కూడా ప్రారంభించామని, అందరికీ సురక్షిత నీరు అందుబాటులో ఉంచాలన్నారు. డెంగీ ప్రబలకుండా అప్రమత్తంగా ఉండాలని, ముందు జాగ్రత్తలపై ప్రజలను చైతన్యపరచాలని సూచించారు. ప్రతి శనివారం ప్రజా చైతన్య ర్యాలీలు నిర్వహించాలన్నారు. రైతులకు అవసరమైన అన్నిరకాల ఇన్‌పుట్స్ అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు. ఆరు జిల్లాల్లో వర్షాభావం ఉంది.. ఐదు లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగింది.. 7లక్షల మంది రైతులకు నష్టం వాటిల్లిందని చెప్పారు. ప్రస్తుతం రూ 670 కోట్ల మేర ఇన్‌పుట్ సబ్సిడీని అందించాలని ప్రాథమికంగా అంచనా వేశామన్నారు. ఎంతమంది రైతులు నష్టపోయారు.. ఇన్‌పుట్ సబ్సిడీ ఎంత అవసరమనే అంశాలపై అంచనాలు రూపొందించి కేంద్రానికి నివేదిక పంపాలన్నారు.