ఆంధ్రప్రదేశ్‌

మోటుపల్లిలో బయటపడ్డ వెయ్యేళ్ల నాటి బౌద్ధ శిల్పాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూలై 9: ప్రకాశం జిల్లా చీరాల సమీపంలోని సముద్ర తీర గ్రామమైన మోటుపల్లిలో ది కల్చరల్ సెంటర్ ఆఫ్ విజయవాడ సీఈవో ప్రముఖ పురాతీస్తు శాస్తవ్రేత్త డా.ఈమని శివనాగిరెడ్డి జరిపిన పరిశోధల్లో చోళులకాలం నాటి బౌద్ధ అవశేషాలు, పురాతనమైన మట్టిపాత్రల శకలాలు బయల్పడ్డాయి. శనివారం మోటుపల్లి శివారు గ్రామమైన రుద్రమరాబపురంలో స్థానిక సర్పంచ్ గోవిందు పందిళ్ల పల్లికి చెందిన దశరథరెడ్డి, రాజు, కడియాల వెంకటేశ్వరరావు, శుభకర మేడసాని సహకారంతో స్థానిక వీరభద్రస్వామి దేవాలయ ఎదురుగా ఉన్న కోనేరు ప్రాంతంలో శివనాగిరెడ్డి భిన్నమైన రెండు ధ్యాన బుద్ధుని శిల్పాలను గుర్తించారు. వారు పరిశీలించగా పద్మాసనంలో, ధ్యానముద్రలో కూర్చున్న బుద్ధుని ఎడమ అరచేతిలో ధర్మచక్రం గుర్తు చెక్కబడిందనీ, విగ్రహ లక్షణాన్ని బట్టి ఈ విగ్రహాలు, క్రీ.శ. 9-10 శతాబ్దాలకు చెందుతాయన్నారు. చేతిపై ధర్మచక్రం గుర్తు గల బుద్ధుని విగ్రహం గతంలో అమరావతిలో బయల్పడిందనీ, మోటుపల్లిలో తొలిసారిగా బయల్పడిన బుద్ధుని విగ్రహాల వల్ల మోటుపల్లి బౌద్ధ క్షేత్రమని తెలిసిందనీ ఆయన అన్నారు. రుద్రమంబపురంలోని సర్పంచ్ ఇంటి పరిసరాల్లో చోళుల కాలానికి చెందిన 3 అడుగుల ఎత్తు, 3-0 వ్యాసం గల ఎరుపురంగు బాన చైనా దేశంలో తయారైన పింగాణీ జాడీ లభ్యమయ్యాయ.