ఆంధ్రప్రదేశ్‌

వారంలో కలెక్టర్ నివేదిక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, సెప్టెంబర్ 19: సింహాచలం పరిధిలోని పంచ గ్రామాల భూముల సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. ప్రస్తుతం గ్రామాల్లో ఉన్న వాస్తవిక పరిస్థితులు, ఎంత భూమి రైతుల అధీనంలో ఉంది.. సమస్య పరిష్కారానికి ఉన్న మార్గాలకు సంబంధించి నివేదిక ఇవ్వాలని జిల్లా కలెక్టర్‌ను ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి ఆదేశించారు. బుధవారం రెవెన్యూ, దేవాదాయశాఖ ఉన్నతాధికారులతో డిప్యూటీ సీఎం అసెంబ్లీ కమిటీ హాలులో ఈ విషయమై సమీక్ష నిర్వహించారు. విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు, విశాఖ ఎమ్మెల్యేలు, సీసీఎల్‌ఏ అనిల్ చంద్ర పునేఠా, రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి మన్మోహన్‌సింగ్, దేవాదాయశాఖ కమిషనర్ డాక్టర్ పద్మ ఇతర ఉన్నతాధికారులు హాజరైన ఈ సమావేశంలో ప్రధానంగా పంచగ్రామాల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యకు పరిష్కారం చూపించే అంశంపై చర్చించారు. ప్రస్తుతం ఇనామ్ చట్టం ప్రకారం స్థానిక గ్రామాల సమస్యకు పరిష్కారం చూపించలేమని, హైకోర్టు ద్వారానే పరిష్కరించగలమని కలెక్టర్ సమావేశం దృష్టికి తెచ్చారు. 1968లో అప్పటి ఇనామ్ సెటిల్మెంట్ ఆఫీసర్ 5 గ్రామాలను ఇనామ్ గ్రామాలుగా తప్పుగా నమోదు చేశారని, వాస్తవంగా ఆ భూమి మొత్తం ఎస్టేట్ ల్యాండ్ కిందకు వస్తుందని ఆధారాలు చూపారు. గ్రామాల్లో ఉన్న వాస్తవ పరిస్థితులతో పాటు రైతుల వద్ద ఉన్న ఆధారాలను పరిగణనలోకి తీసుకుని వారంరోజుల్లో నివేదిక సమర్పించాలని కలెక్టర్‌ను ఆదేశించారు. నివేదిక వచ్చిన తరువాత న్యాయ సలహా తీసుకుని తదుపరి చర్యలు చేపట్టాలని సమావేశంలో నిర్ణయించారు.