ఆంధ్రప్రదేశ్‌

24 నుండి అన్ని నియోజకవర్గాల్లో యువనేస్తం అవగాహన సదస్సులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, సెప్టెంబర్ 21: తెలుగునాడు స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ముద్రించిన యువనేస్తం పోస్టర్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆవిష్కరించారు. శుక్రవారం ఉండవల్లి ప్రజావేదిక వద్ద జరిగిన ఈ కార్యక్రమానికి పెద్దఎత్తున కార్యకర్తలు తరలివచ్చారు. రాష్ట్రంలో ప్రతి ఇంటికీ పెద్దకొడుకుగా ఉంటూ వారి కష్టాలను గుర్తించి వారి బాగు కోసం నిరంతరం కృషిచేస్తూ నిరుద్యోగుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు ముఖ్యమంత్రి యువనేస్తం ప్రారంభించారని టీఎన్‌ఎస్‌ఎఫ్ నేతలు హర్షం వ్యక్తంచేశారు. నిరుద్యోగులను ఆదుకునేందుకు 20వేల ఉద్యోగాల భర్తీకి అనుమతిచ్చారని, దీంతో ప్రతి నిరుద్యోగి ఆనందంగా ఉన్నారని టీఎన్‌ఎస్‌ఎఫ్ నేతలు ముఖ్యమంత్రి దృష్టికి తెచ్చారు. యువనేస్తం పథకంపై యువతలో అవగాహన కోసం రాష్టవ్య్రాప్త అవగాహనా కార్యక్రమాలు నిర్వహిస్తామని టీఎన్‌ఎస్‌ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు బ్రహ్మం ముఖ్యమంత్రికి తెలిపారు. రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో యువనేస్తం అవగాహన సభలు నిర్వహిస్తామని ఈనెల 24 నుండి అక్టోబర్ 4వ తేదీ వరకు ముఖ్యమంత్రికి అభినందన కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు.
నవంబర్ 3వ వారంలో అమరావతిలో ముఖ్యమంత్రికి అభినందనసభ నిర్వహించ నున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఎన్‌ఎస్‌ఎఫ్ ప్రతినిధులు ఏ రాజేష్, డీఎస్ శేషు, వెంకటప్ప భాస్కర్ యాదవ్, సాకిరి చైతన్య, ఆనందగౌడ్, చైతన్య ప్రకాష్, ప్రణయ్, రిషి, వెంకటేశ్వరరావు, ధర్మేంద్ర, తిరుమల నాయుడు తదితరులు పాల్గొన్నారు.