ఆంధ్రప్రదేశ్‌

గురజాడకు చంద్రబాబు నివాళి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, సెప్టెంబర్ 21: తెలుగు సాహితీలోకంలో మహాకవి గురజాడ అప్పారావు ఓ ధృవతారగా నిలిచారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివాళులర్పించారు. శుక్రవారం గురజాడ జయంతి సందర్భంగా ఉండవల్లి గ్రీవెన్స్‌హాలులో ఆయన చిత్రపటానికి ముఖ్యమంత్రి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ తెలుగు సాహిత్యంలో నూతన ఒరవడికి గురజాడ నాంది పలికారన్నారు. కఠిన పదబంధాలతో కూడిన తెలుగు సాహిత్యాన్ని వాడుక భాషతో పరుగులు తీయించారని ప్రస్తుతించారు. కన్యాశుల్కం నాటకానికి నేటికీ వనె్న తరగలేదన్నారు. సాంఘిక దురాచారాలపై గురజాడ అక్షరాగ్ని కన్యాశుల్కం నాటకమన్నారు. పుత్తడిబొమ్మ పూర్ణమ్మ గేయం ద్వారా బాల్యవివాహాలపై ఉద్యమించారని శ్లాఘించారు. దేశమంటే మట్టికాదోయ్ గీతం తెలుగు జాతి ఉన్నంత కాలం స్ఫూర్తినిచ్చే పతాక గీతమని అభివర్ణించారు. గురజాడను తెలుగువారి జాతీయకవిగా మహాకవి శ్రీశ్రీ అన్న మాటలను చంద్రబాబు గుర్తుచేశారు. సంఘ సంస్కరణలకు మానవతా పరిమళాలు అద్ది రచనలు చేసిన మహనీయుడు గురజాడ అన్నారు.