ఆంధ్రప్రదేశ్‌

రాఫెల్ డీల్‌పై జగన్ నోరెందుకు మెదపరు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, సెప్టెంబర్ 22: రాఫెల్ డీల్‌పై ప్రతిపక్ష నేత జగన్మోహనరెడ్డి ఎందుకు నోరు మెదపడం లేదని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి కేఎస్ జవహర్ ప్రశ్నించారు. శనివారం గుంటూరులోని టీడీపీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేఖర్ల సమావేశంలో మంత్రి జవహర్ మాట్లాడుతూ తన స్వప్రయోజనాల కోసం జగన్ దేశ ప్రయోజనాలను తాకట్టుపెడుతున్నారన్నారు. రాఫెల్ డీల్‌పై ఫ్రాన్స్ మాజీ అధ్యక్షుడు మాట్లాడుతుంటే ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్మోహనరెడ్డి ఎన్డీఏ ప్రభుత్వాన్ని నిలదీసే ప్రయత్నం ఎందుకు చేయడం లేదన్నారు. వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఓ ప్రైవేటు సంస్థకు ఉదారంగా ధారాదత్తం చేస్తున్నా ప్రతిపక్ష నేతగా జగన్ ఎందుకు ప్రశ్నించరన్నారు. రాష్ట్ర సమస్యలపై అసెంబ్లీలో, దేశ సమస్యలపై పార్లమెంటులో ప్రశ్నించకుండా పారిపోయిన వైసీపీ నేతల తీరును ప్రజలు అసహ్యించుకుంటున్నారన్నారు. ఎవరేమైనా తాను సీఎం కావాలన్నదే జగన్ ఏకైక లక్ష్యమని దుయ్యబట్టారు. జగన్ వౌనం వహించడమంటే కేంద్ర వైఖరిని సమర్థించడమేనని ప్రజలు భావిస్తున్నారని పేర్కొన్నారు. రూ.526 కోట్లతో కొనుగోలు చేయాల్సిన ఒక్క యుద్ధ విమానాన్ని రూ.1670 కోట్లకు కొనుగోలు చేస్తూ దివాలా తీసే కంపెనీకి కేంద్రం దేశ రక్షణ బాధ్యతలు అప్పగించడం సరికాదన్నారు. కేసుల మాఫీ కోసమే జగన్ ప్రధాని మోదీ వద్ద మోకరిల్లుతున్నారని విమర్శించారు. రాష్ట్రంలో లేని అవినీతిని నిత్యం విమర్శించే జగన్ సాక్ష్యాలతో రుజువైన రాఫెల్ డీల్‌పై మాట్లాడకపోవడం దొంగలు .. దొంగలు ఊళ్లు పంచుకున్న చందంగా ఉందన్నారు. రానున్న ఎన్నికల్లో వైసీపీకి ప్రజలు బుద్ధిచెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు.