ఆంధ్రప్రదేశ్‌

ఇదిగో ఆహ్వానం..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, సెప్టెంబర్ 22: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు న్యూయార్క్ పర్యటన ఐక్యరాజ్య సమితి ఆహ్వానం మేరకు కాదని, వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సుకు వెళుతూ ప్రజలను పక్కదారి పట్టిస్తున్నారని బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు చేసిన ఆరోపణలకు ముఖ్యమంత్రి కార్యాలయం స్పందించింది. ఈ నెల 25వ తేదీన న్యూయార్క్‌లో జరిగే జీరో బేస్డ్ నాచురల్ ఫార్మింగ్ (ప్రకృతి వ్యవసాయం)పై కీలక ఉపన్యాసం చేయాల్సిందిగా ఆహ్వానిస్తూ ముఖ్యమంత్రికి యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్‌మెంట్ ప్రోగ్రాం ఆసియా, పసిఫిక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎరిక్ సోల్‌హైమ్ పంపిన లేఖను శనివారం మీడియాకు విడుదల చేసింది. లేఖ సారాంశం ఇలా ఉంది. ప్రపంచ వ్యాప్తంగా పర్యావరణ పరిస్థితులు సవాల్‌గా పరిణమించాయి.. ప్రధానంగా ప్రజారోగ్యం, ఆహారంపై ప్రభావం చూపుతున్నాయి.. అటవీ భూములు అంతరించిపోవటంతో వాతావరణ సమతుల్యత దెబ్బతింటోంది.. ఈ పరిస్థితుల్లో వ్యవసాయ ఉత్పత్తులకు అనువైన భూసారాన్ని పెంచగలిగే సేద్యం అవసరం.. ఇందులో భాగంగా యూఎన్ ఎన్విరాన్‌మెంట్, యూఎన్ ఉమెన్, బీఎన్‌పీ పారిబాస్ ఎస్‌ఏ, వరల్డ్ ఆగ్రోఫారెస్ట్రీ సెంటర్, ఇంకా అనేక అంతర్జాతీయ సంస్థలు, ఆర్థిక సంస్థలు ‘సుస్థిర వ్యవసాయం ప్రాపంచిక సవాళ్లు..అవకాశాలు’పై యూఎన్ జనరల్ అసెంబ్లీ ఈనెల 24న (్భరత కాలమానం ప్రకారం 25న) సదస్సు నిర్వహిస్తోంది.. ప్రపంచ వ్యాప్తంగా అభివృద్ధి చెందుతున్న దేశాలు అనుసరించే విధానాలు, భూముల వినియోగం, ఆర్థిక పురోగతి, నూతన ఆవిష్కరణలు ఇంకా పలు అంశాలపై చర్చించేందుకు ఇది వేదిక కానుంది. ఆంధ్రప్రదేశ్‌లో మీ నాయకత్వంలో చేపడుతున్న జీరోబేస్డ్ నాచురల్ ఫార్మింగ్ (ప్రకృతి వ్యవసాయం)పర్యావరణ, సామాజిక, ఆర్థిక అంశాలపై చూపుతున్న ప్రభావం అమోఘం.. 2024 నాటికి 60 లక్షల మంది రైతుల్ని ప్రకృతి వ్యవసాయంలో భాగస్వాములు చేసేందుకు ప్రణాళిక రూపొందించిన నేపథ్యంలో మీ అనుభవాలను ప్రపంచ దేశాలకు వివరించేందుకు సదస్సుకు హాజరు కావాల్సిందిగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు పంపిన ఆహ్వానప్రతిని సీఎంఒ మీడియాకు విడుదల చేసింది. కాగా అవాస్తవ ఆరోపణలు చేస్తున్న జీవీఎల్‌పై ఏపీ టీడీపీ తీవ్రంగా ఖండించింది. జీవీఎల్‌పై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పలువురు నేతలు హెచ్చరించారు.