ఆంధ్రప్రదేశ్‌

ప్రభుత్వానికి కాదు.. జగన్‌కు లేఖ రాయండి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, సెప్టెంబర్ 23: కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ రాఫెల్ కుంభకోణంపై బీజేపీని ఎండగడుతుంటే ఇక్కడి ప్రతిపక్ష నేత జగన్మోహనరెడ్డి మాత్రం స్పందించడం లేదని, కేవీపీ రామచంద్రరావు దీనిపై జగన్‌కు ఎందుకు లేఖ రాయలేదని ఏపీఎస్ ఆర్టీసీ చైర్మన్ వర్ల రామయ్య ప్రశ్నించారు. బీజేపీతో జగన్ లాలూచీని ఎందుకు ప్రశ్నించడం లేదని నిలదీశారు. ఇక్కడి టీడీపీ రాష్ట్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్‌లో ఆదివారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ ప్రభుత్వం ప్రత్యేక హోదా సాధన కోసం కేంద్రంపై ఉమ్మడిగా ఉద్యమిద్దామంటే కేవీపీ ఎందుకు కలిసిరావడం లేదని ప్రశ్నించారు. విడివిడిగా పోరాడితే వచ్చే ప్రయోజనం కన్నా ఉమ్మడి పోరాటంతో ఫలితం త్వరగా వస్తుందన్న ప్రజల ఆకాంక్షను కేవీపీ, జగన్ ఎందుకు పరిగణనలోకి తీసుకోరని నిలదీశారు. ప్రత్యేక హోదాను 2019లో ఏపీ ఎంపీల బలంతోనే ఏర్పడబోయే కేంద్ర ప్రభుత్వం నుంచి ఆంధ్రులు సాధించుకుంటారని, దీనిలో ఎవరి దయాదాక్షిణ్యాలు అవసరం లేదన్నారు. రాష్ట్రానికి కాంగ్రెస్ మోసం చేస్తే బీజేపీ నమ్మకద్రోహం చేసిందని, ప్రత్యేక హోదా కోసం పోరాటం ప్రారంభించగానే వెనుకబడిన జిల్లాలకు ఇచ్చిన రూ. 350 కోట్లను మోదీ వెనక్కు తీసుకున్నారని ఆక్షేపించారు. ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టేందుకు రాయలసీమ డిక్లరేషన్ పేరుతో బీజేపీ నేతలు కుట్రలు చేస్తున్నారని విమర్శించారు. తొలినాళ్లలోనే ప్రత్యేక హోదాపై పోరాటం చేసి ఉంటే రాష్ట్రాన్ని బీజేపీ మరింత దెబ్బతీసి ఉండేదన్నారు. విభజన చట్టంలోని హక్కుల సాధన కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం ఎంపీలు చేయని ఒత్తిడి లేదని, 29సార్లు ముఖ్యమంత్రి ఢిల్లీ వెళ్లి మరీ ఒత్తిడి చేసిన విషయం కేవీపీకి తెలియదా అంటూ నిలదీశారు. మోదీకి లొంగిపోయి రాష్ట్రానికి తీరని అన్యాయం చేస్తున్న జగన్మోహనరెడ్డికి లేఖాస్త్రాలు సంధించకుండా పదేపదే రాష్ట్ర ప్రభుత్వానికి లేఖలు రాయడంలో కేవీపీ ఉద్దేశమేమిటో స్పష్టం చేయాలన్నారు. ఇకనైనా ప్రత్యేక హోదాపై చిత్తశుద్ధి ఉంటే ప్రభుత్వం చేసే పోరాటంలో కలిసి రావాలని, లేఖలకే పరిమితమైతే కేవలం వ్యక్తిగత ప్రచారానికే కేవీపీ పాకులాడుతున్నారని ప్రజలు అర్థం చేసుకుంటారని వర్ల రామయ్య స్పష్టం చేశారు.