ఆంధ్రప్రదేశ్‌

లింగ వివక్షకు తావులేని అమరావతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, సెప్టెంబర్ 28: అమరావతి రాజధాని పరిధిలో చేపడుతున్న వివిధ ప్రాజెక్టుల్లో పనిచేస్తున్న మహిళలకు మెరుగైన పని పరిస్థితులు, ఎలాంటి లింగ వివక్షతకు తావులేని విధంగా చేపట్టాల్సిన చర్యలకు అనువైన కార్యాచరణ ప్రణాళిక రూపకల్పనకు శరవేగంగా చర్యలు జరుగుతున్నాయి. దీనికి సంబంధించిన కార్యచరణ తయారీపై విజయవాడ ఏపీసీఆర్‌డీఏ కార్యాలయంలో స్పెషల్ కమిషనర్ వి రామమనోహరరావు అధ్యక్షతన శుక్రవారం సంప్రదింపుల సమావేశం నిర్వహించారు. వాసవ్య మహిళా మండలి అధ్యక్షురాలు డాక్టర్ కీర్తి, ఆ సంస్థ ప్రతినిధులు, మహిళా మిత్రలు, వివిధ శాఖల అధికారులు, ఏపీసీఆర్‌డీఏ అధికారులు ఈ సమావేశంలో పాల్గొని రాజధాని అమరావతి పరిధిలోని పరిస్థితులపై చర్చించారు. రాజధాని నగరంలో నిర్మాణ ప్రదేశాల్లో పని చేస్తున్న మహిళా కార్మికులు, అధికారులకు భద్రతా పరమైన చర్యలు, మెరుగైన పని పరిస్థితులపై సవివరంగా చర్చించారు. లింగవివక్షతకు తావులేకుండా గట్టి చర్యలు చేపట్టాలన్నారు. ప్రతి గ్రామం నుంచి ఇద్దరు మహిళా ప్రతినిధులను మహిళా సమస్యలు తెలుసుకునే విధంగా ఏర్పాటు చేయాలని సూచించారు. లింగ వివక్షతకు అవకాశం లేని విధంగా అమలు చేస్తున్న కార్యక్రమాలను రాజధాని పరిధిలో ఏపీసీఆర్‌డీఏ సహకారంతో సమన్వయం చేసుకుని మరింత సమర్థవంతంగా అమలుకు కార్యాచరణ చేపట్టాలన్నారు. రాజధాని పరిధిలోని ప్రతి కాంపిటెంట్ అథారిటీ ఏరియాలో మహిళల సంబంధిత సమస్యలు తెలుసుకుని, పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటున్నామని ఏపీసీఆర్‌డీఏ ల్యాండ్స్ డైరెక్టర్ బిఎల్ చెన్నకేశవరావు తెలిపారు. తుళ్లూరు ఎఎస్పీ బి కృష్ణారావు మాట్లాడుతూ మహిళల సమస్యలు తెలుసుకునేందుకు ప్రతి పోలీస్ స్టేషన్‌లో ఇద్దరు మహిళా కానిస్టేబుళ్లను ప్రత్యేకంగా నియమించామని తెలిపారు. రాజధాని పరిధిలో పనిచేస్తున్న మహిళలతో పాటు పురుషుల ఆరోగ్య సమస్యలపై కౌనె్సలింగ్ చేయాల్సిన ఆవశ్యకత ఉందని ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ కోఆర్డినేటర్ డాక్టర్ నాగార్జున చెప్పారు. అమరావతి అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ జి నాగేశ్వరరావు కార్మిక చట్టాల గురించి వివరించారు. తాడికొండ ఇన్‌ఛార్జి చైల్డ్ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్ అధికారి ఎస్‌వై సూరాని మాట్లాడుతూ అంగన్‌వాడీల పరిధిలో అవగాహన శిబిరాలు నిర్వహిస్తున్నామని, వివరించారు. ఈ సమావేశంలో స్ట్రాటజీ డైరెక్టర్ జేఎస్‌ఆర్‌కె శాస్ర్తీ, సెర్ఫ్ ప్రాజెక్ట్ మేనేజర్ అరుణ, గుంటూరు జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ టి నాగకోటేశ్వరరావు, ఏపీసీఆర్‌డీఏ జాయింట్ డైరెక్టర్ ఎస్.షర్మద, ఎల్‌అండ్‌టీ, ఎన్‌సీసీ, బీఎస్‌సీపీఎల్, బీఎస్‌ఆర్, నిర్మాణ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.