ఆంధ్రప్రదేశ్‌

కిడారి కుటుంబాన్ని ఆదుకుంటాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రభుత్వపరంగా రూ.కోటి సహాయం పార్టీపరంగా ఒక్కొక్కరికి రూ. ఐదు లక్షలు
కిడారి రెండో తనయుడికి గ్రూప్-1 ఉద్యోగం
విశాఖలో ఇంటి స్థలం ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటన
-------------------------------------------------------------------------

పాడేరు, సెప్టెంబర్ 28: మావోయిస్టుల హత్యాకాండకు బలైన ప్రభుత్వ విప్, అరకులోయ శాసనసభ్యుడు కిడారి సర్వేశ్వరరావు కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు భరోసా ఇచ్చారు. విశాఖ ఏజెన్సీలోని పాడేరులో కిడారి క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. మావోల చేతిలో హత్యకు గురైన కిడారి కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించి వారికి ధైర్యం చెప్పారు. అనంతరం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ కిడారి కుటుంబానికి ప్రభుత్వం తరపున కోటి రూపాయలు చెల్లిస్తామని, పార్టీపరంగా కుటుంబ సభ్యులకు ఒక్కొక్కరికి ఐదు లక్షల రూపాయలను ఇవ్వనున్నట్టు ప్రకటించారు. దివంగత నాయకుడు కిడారి రెండో కుమారుడు సందీప్‌కుమార్‌కు గ్రూప్-1 ఉద్యోగం కల్పిస్తామని ఆయన హామీ ఇచ్చారు. స్వంత ఇళ్లు కూడా లేని కిడారి కుటుంబానికి విశాఖపట్నంలో ఇంటి స్థలం కేటాయించి ఇళ్ల నిర్మాణానికి సహకరిస్తామని ఆయన చెప్పారు. ఒక తండ్రిగా, ముఖ్యమంత్రిగా, తెలుగుదేశం పార్టీ అధినేతగా కిడారి కుటుంబానికి అండగా నిలిచి, ఆయన ఆశయాల సాధనకు కృషి చేస్తామని ఆయన అన్నారు. అమెరికా పర్యటనలో ఉన్న తనకు కిడారిని హత్య చేసినట్టు తెలుసుకుని తీవ్ర దిగ్భ్రాంతికి లోనైనట్టు చెప్పారు. ఈ విషయం తెలిసిన వెంటనే విశాఖ జిల్లా కలెక్టర్, డి.ఐ.జి.లతో టెలిఫోన్‌లో మాట్లాడి సంఘటనకు సంబంధించిన వివరాలను తెలుసుకున్నట్టు ఆయన పేర్కొన్నారు. ప్రజాసమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారానికి గ్రామదర్శిని కార్యక్రమానికి వెళుతున్న కిడారిని మావోయిస్టులు హత్య చేయడం బాధాకరమని ఆయన అన్నారు. అరకు ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని, గిరిజనులను అందరితో సమానంగా పైకి తీసుకురావాలని సర్వేశ్వరరావు నిరంతరం తపించే వారని ఆయన చెప్పారు. తన వద్దకు ఎప్పుడు వచ్చినా గిరిజనులకు వౌలిక వసతులు కల్పించాలని, వారికి ఇళ్లు మంజూరు చేయాలని, ఆదాయం పెంచే మార్గాలను చూడాలని చెప్పేవారని, తన పిల్లల కోసం ఏనాడు తనతో సంప్రదించలేదని ఆయన అన్నారు. నిరంతరం ప్రజల కోసం పాటుపడుతూ గ్రామాలలో పర్యటించి వారితో సన్నిహితంగా ఉండేవారని ఆయన చెప్పారు. అజాత శత్రువుగా ఉండే కిడారిని హత్య చేయడం దారుణమని ఆయన అన్నారు. ప్రజలకు సేవ చేసే వారిని చంపితే నాయకత్వ లేమి ఏర్పడి గిరిజనులకు అన్యాయం జరుగుతుందని ఆయన చెప్పారు. మంచి భవిష్యత్ ఉన్న కిడారి అతి చిన్న వయస్సులోనే మరణించడం బాధాకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల కోసం త్యాగం చేసిన ఆయన ఆశయాల సాధనకు కుటుంబ సభ్యులు కూడా కృషి చేయాలని చంద్రబాబు సంక్షేమ శాఖా మంత్రి నక్కా ఆనందబాబు, ఎమ్మెల్యేలు గిడ్డి ఈశ్వరి, పంచకర్ల రమేష్‌బాబు, డి.జి.పి. ఆర్.పి.్ఠకూర్, కలెక్టర్ ప్రవీణ్‌కుమార్, ఎస్.పి. రాహుల్‌దేవ్ శర్మ, జి.సి.సి. మేనేజింగ్ డైరెక్టర్ టి.బాబురావునాయుడు, పాడేరు ఐ.టి.డి.ఎ. ప్రాజెక్టు అధికారి డి.కె.బాలాజీ, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.