ఆంధ్రప్రదేశ్‌

ఆర్టీజీకి అవార్డు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, సెప్టెంబర్ 28: ఏపీ రాష్ట్ర ప్రభుత్వ రియల్ టైమ్ గవర్నెన్సు (ఆర్టీజీ)కు ప్రఖ్యాత హిటాచీ సంస్థ అందచేసే ట్రాన్స్‌ఫర్మేషన్ అండ్ పీపుల్స్ చాయిస్ అవార్డు లభించింది. అమెరికాలోని శాన్‌డీగోలో హిటాచీ నెక్ట్స్-2018 అవార్డుల ప్రదానోత్సవం శుక్రవారం జరిగింది. ఈ అవార్డును ఆర్టీజీ సీఈవో బాబు.ఎ, ముఖ్య కార్యదర్శి రాజశేఖర్ అందుకున్నారు. ఆర్టీజీ ద్వారా 5 కోట్ల ప్రజలకు అందచేస్తున్న సేవలను ప్రశంసించింది.

మందుల షాపుల బంద్‌

విజయవాడ, సెప్టెంబర్ 28: ఆన్‌లైన్‌లో ఔషధ విక్రయాలను అనుమతించే విధంగా కేంద్రం చేస్తున్న ప్రయత్నాలను నిరసిస్తూ ఆలిండియా ఆర్గనైజేషన్ ఆఫ్ కెమిస్ట్స్ అండ్ డ్రగ్గిస్ట్స్ పిలుపు మేరకు శుక్రవారం జరిగిన దేశవ్యాప్త బంద్‌లో భాగంగా ఆంధ్రప్రదేశ్‌లో వున్న దాదాపు 30వేల మందుల షాపులు మూతబడ్డాయి. ఔషధ నియంత్రణ చట్టానికి ఎలాంటి సవరణలు చేయరాదంటూ వివిధ నగరాల్లో ర్యాలీలు జరిగాయి. కేంద్రం నిర్ణయాన్ని తామంతా వ్యతిరేకిస్తున్నామని అసోసియేషన్ నేతలు చెప్పారు.

1 నుంచి భాషా పండితుల ఆత్మగౌరవ దీక్షలు

విజయవాడ, సెప్టెంబర్ 28: రాష్ట్రంలోని భాషా పండితుల అపరిష్కృత డిమాండ్ల సాధనకై అక్టోబర్ 1 నుంచి ఐదో తేదీ వరకు విజయవాడలో ఆత్మగౌరవ దీక్షలు నిర్వహించబోతున్నామని రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత పరిషత్ జిల్లా అధ్యక్షులు అద్దంకి అశోక్‌కుమార్, ప్రధాన కార్యదర్శి ఆదిరాల అంబోజి పోతకర్ ఓ ప్రకటనలో తెలిపారు.