ఆంధ్రప్రదేశ్‌

చివరివిడత పసుపు కుంకుమ నగదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, సెప్టెంబర్ 28: రాష్ట్రప్రభుత్వం లోటుబెడ్జెట్‌తో ఏర్పడినప్పటికీ ఇచ్చిన హామీమేరకు డ్వాక్రా సంఘాల సభ్యులకు ఒక్కొక్కరికీ 10వేల రూపాయల చొప్పున చంద్రన్న పసుపు-కుంకుమ కింద అందజేస్తున్నామని రాష్ట్ర స్ర్తి శిశు సంక్షేమ, సెర్ప్ శాఖ మంత్రి పరిటాల సునీత పేర్కొన్నారు. శుక్రవారం గుంటూరులో చంద్రన్న పసుపుకుంకుమ వడ్డీ రాయితీపై మండల సమాఖ్య లీడర్లు, వెలుగు సిబ్బందికి జరిగిన అవగాహన సదస్సులో పౌరసరఫరాల శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావుతో కలిసి ఆమె ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. చంద్రన్న పసుపుకుంకుమ సొమ్ము ప్రతి మహిళకు అందినది, లేనిదీ తెలుసుకుని మిగిలిన వారికి అందించేందుకు ఈ అవగాహన సదస్సును ఏర్పాటుచేసినట్లు తెలిపారు. రాష్టవ్య్రాప్తంగా 86 లక్షల మంది డ్వాక్రా మహిళలకు చంద్రన్న పసుపుకుంకుమ కింద రూ.8,600 కోట్లు మంజూరు చేశామన్నారు. ఇప్పటివరకు మూడు విడతల్లో ప్రతి డ్వాక్రా సంఘ మహిళకు 8 వేల రూపాయల వంతున రూ.6,833 కోట్లు అందించామని చెప్పారు. మిగిలిన 2 వేల రూపాయలను దసరా కానుక కింద వారి వారి ఖాతాల్లో జమచేస్తామని పేర్కొన్నారు. డయాలసిస్ చేయించుకునే రోగులకు 2,500 చొప్పున వచ్చే నెల నుండి వారి ఖాతాల్లో జమచేస్తామని తెలిపారు. గత నాలుగు సంవత్సరాల్లో డ్వాక్రా మహిళలకు వడ్డీ రాయితీ కింద 2,514 కోట్లను అందజేయడం జరిగిందని పేర్కొన్నారు. పౌరసరఫరాల శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు మాట్లాడుతూ ప్రతి డ్వాక్రా మహిళ ఫ్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను సద్వినియోగం చేసుకుని స్వశక్తితో ఆర్థిక ప్రగతి సాధించాలన్నారు. డ్వాక్రా రుణమాఫీ చేస్తే అందరికీ లబ్ధిచేకూరదన్న ఉద్దేశంతోనే ప్రతి సభ్యురాలికి 10 వేల రూపాయలు అందించాలని రాష్ట్రప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్ నన్నపనేని రాజకుమారి, ఎమ్మెల్సీలు డొక్కా మాణిక్యవరప్రసాద్, ఎఎస్ రామకృష్ణ, సెర్ప్ సిఇఒ కృష్ణమోహన్, కలెక్టర్ కోన శశిధర్ తదితరులు పాల్గొన్నారు.