ఆంధ్రప్రదేశ్‌

హింసతో సాధించేదేమీ లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గిరిజన నాయకత్వాన్ని అంతమొందిస్తారా
బాక్సైట్ పాపం వైఎస్‌దే
మాజీ ఎమ్మెల్యే సోమ కుటుంబానికి ముఖ్యమంత్రి చంద్రబాబు భరోసా
------------------------------------------
విశాఖపట్నం/అరకు సెప్టెంబర్ 28: మావోయిస్టులు హింసాత్మక ఘటనలో సాధించేదేమీ లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉద్ఘాటించారు. అధికార పార్టీ ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమను మావోయిస్టులు గత 23వతేదీన కాల్చి చంపగా, వారి కుటుంబ సభ్యులను చంద్రబాబు విశాఖ ఏజెన్సీలోని అరకు, పాడేరుల్లో వేర్వేరుగా శుక్రవారం పరామర్శించారు. అరుకు ఐటీడీఏ వసతిగృహంలో నివాసం ఉంటున్న సోమ భార్య ఇచ్ఛావతి, ఆరుగురు పిల్లలను చంద్రబాబు ఓదార్చారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ గిరిజన ప్రాంతంలోప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న నాయకులను మట్టుపెట్టడం ద్వారా మావోయిస్టులు ఏం సందేశాన్ని ఇస్తున్నారని ప్రశ్నించారు. మావోయిస్టులు పాల్పడిన ఈ దారుణ ఘాతుకాన్ని ఖండిస్తున్నానన్నారు. విశాఖ ఏజెన్సీలో బాక్సైట్ మైనింగ్ కాంగ్రెస్ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి పాపమేనన్నారు. తాను అధికారం చేపట్టిన తరువాత బాక్సైట్ మైనింగ్‌కు అనుమతించేది లేదని స్పష్టంగా ప్రకటించామని గుర్తు చేశారు.
సోమ కుటుంబాన్ని ఆదుకుంటాం
పార్టీ కార్యకర్తగా గుర్తింపుతో ఎమ్మెల్యే స్థాయికి ఎదిగిన సివేరి సోమ గిరిజనుల్లో మంచి నాయకత్వ లక్షణాలు కలిగిన వ్యక్తిగా చంద్రబాబు కొనియాడారు. మావోయిస్టుల దుశ్చర్యలో ప్రాణాలు కోల్పోయిన మాజీ ఎమ్మెల్యే శివేరి సోమ కుటుంబాన్ని ఆదుకోవడం ప్రభుత్వపరంగా, పార్టీపరంగా తమకు ఎంతో ముఖ్యమన్నారు.
ప్రభుత్వపరంగా సోమ కుటుంబంలోని భార్య సహా ఆరుగురు పిల్లలకు ఒక్కొక్కరికీ రూ.10 లక్షలు, పార్టీపరంగా ఒక్కొక్కరికీ రూ.5 లక్షలు ఆర్థిక సాయం అందించనున్నట్టు ప్రకటించారు. అలాగే పెద్ద కుమారుడు అబ్రహాం పార్టీ వ్యవహారాల్లో చురుగ్గా పాల్గొంటున్నాడని, అతనికి రాజకీయంగా గుర్తింపుఇవ్వడంతో పాటు రెండో కుమారుడు సురేష్‌కు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వనున్నట్టు ప్రకటించారు. మాజీ ఎమ్మెల్యే సోమకు అరుకులో సొంతిల్లు లేదని, ఇప్పటికే ఇక్కడ నిర్మాణంలో ఉన్న ఇంటికి పట్టా మంజూరు చేయడంతో పాటు విశాఖ నగరంలో ఇంటి స్థలం ఇస్తామని ప్రకటించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు వెంట ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప, గిరిజన సంక్షేమ శాఖామంత్రి నక్కా ఆనంద్ బాబు, డీజీపీ ఆర్పీ ఠాకూర్, జిల్లా కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ ఇతర అధికారులు పాల్గొన్నారు.