ఆంధ్రప్రదేశ్‌

మూడు రోజుల పసికందు విక్రయం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెదగంట్యాడ(విశాఖ), సెప్టెంబర్ 30: కుటుంబ ఆర్థిక పరిస్థితుల కారణంగా అప్పుడే పుట్టిన పసికందును అంగటిలో పెట్టి విక్రయించిన సంఘటన మహావిశాఖ గాజువాక జోనల్ పరిధిలోని పిట్టవానిపాలెంలో జరిగింది. మూడు రోజుల క్రితం జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పసికందు పెదతండ్రి దీనిపై దువ్వాడ పోలీసులకు ఫిర్యాదు చేయ గా విచారణ ప్రారంభించారు. పిట్టవానిపాలెంకి చెందిన ఒక వ్యక్తి మద్యానికి బానిసై తన భార్య మూడో కాన్పులో పుట్టిన కవలల్లో ఒకర్ని మధ్యవర్తుల ద్వారా విక్రయించాడు. ఒకటి, రెండు కాన్పుల్లో బాబు, పాప జన్మించారు. మూడో కాన్పులో ఇద్దరు కవలలకు మూడు రోజుల క్రితం విశాఖపట్నం కేజీహెచ్‌లో ఆతని భార్య జన్మనిచ్చినట్లు స్థానికులు తెలిపారు. పెదతండ్రికి పిల్లలు లేకపోవడంతో మూడో కాన్పులో పుట్టే తమ్ముడు పిల్లలను పెంచుకునేందుకు పురిటికి అయ్యే ఖర్చు భరించాడు. కవలల్లో ఒకరు మగ బిడ్డకాగా, మరొకరు ఆడబిడ్డ అయ్యారు. ఈ తరుణంలో కవలలను విక్రయిస్తానని అదే గ్రామానికి చెందిన ఒక కుల వృత్తి చేసే వ్యక్తికి పిల్ల తండ్రి చెప్పారు. దీంతో మునగపాక మండలం తోటాడ గ్రామానికి చెందిన భార్యాభర్తలకు మధ్యవర్తులు సుమారు 5లక్షల రూపాయలకు పసికందును విక్రయించారు. ఈ అమ్మకంలో తల్లిదండ్రులకు మాత్రం 35వేల రూపాయలు అందాయని తెలిసింది. దీనిపై పసికందుల తండ్రిని సొంత అన్న నిలదీశాడు. పసికందు విక్రయం తెలిసి మధ్యవర్తులను కూడా సొంత అన్న నిలదీసినట్లు స్థానికులు చెబుతున్నారు. అయితే పిల్ల కోసం భార్య బలవంతంతో పిల్ల తల్లిదండ్రులు శనివారం తోటాడకి వెళ్లి వారిబిడ్డను తిరిగి ఇవ్వాలని కొనుక్కొన్న వారిని అడిగితే వారివ్వలేదు. విచారణ చేపట్టిన పోలీసులు పసికందును ఆదివారం రాత్రి కన్న తల్లి చెంతకు చేర్చినట్లు తెలిసింది.