ఆంధ్రప్రదేశ్‌

సామాజిక తీవ్రవాది పవన్, ఆర్థిక ఉగ్రవాది జగన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, సెప్టెంబర్ 30: రాష్ట్రంలో ఇద్దరు వ్యక్తులు అవగాహన రాహిత్యంతో రాజకీయాలు నడుపుతున్నారని, వారిలో ఒకరు ఆర్థిక ఉగ్రవాది జగన్మోహన్‌రెడ్డి అయితే, పవన్‌కళ్యాణ్ సామాజిక తీవ్రవాది అని ఆర్టీసీ చైర్మన్, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య విమర్శించారు. ఆదివారం ఆయన ఇక్కడ విలేఖరులతో మాట్లాడుతూ జగన్ తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఆర్థిక ఉగ్రవాదిగా మారాడని, పవన్ మాట్లాడే భాష మార్చుకోవలసి ఉందని, సినిమాల్లో మాదిరిగా నిజజీవితంలో డైలాగులు చెపితే కుదరదని హెచ్చరించారు. కాస్టింగ్ కౌచ్‌లో శ్రీరెడ్డి అనే అమ్మాయికి అన్యాయం జరిగితే పోలీసు అధికారులకు ఫిర్యాదు చేయాలని సలహా ఇచ్చిన పవన్‌కళ్యాణ్ పశ్చిమ గోదావరి జిల్లా పర్యటనలో తన హత్యకు ప్లాన్ చేశారని, ఎన్నికల్లోపు చంపేస్తే అడ్డు తొలుగుతుందని అనుకుంటున్నారని, ఆ ముగ్గురు వ్యక్తులు ఎవరో తనకు తెలుసని వ్యాఖ్యలు చేయటం హాస్యాస్పదమన్నారు. దీనిపై ఆ జిల్లా ఎస్పీ రవిప్రకాష్ స్పందించి ఆధారాలను పోలీసులకు అందజేయాలని, ఆ ముగ్గురి వివరాలు తెలియజేయాలని, హత్య కుట్రపై దర్యాప్తునకు ఆధారాలు కావాలని పవన్‌ను అడిగింది నిజం కాదా అని వర్ల ప్రశ్నించారు. పవన్ ఆరోపించినట్లు మన్యంలో జరిగిన ఎమ్మెల్యే హత్య శాంతిభద్రతల విఘాతం కిందికి రాదన్నారు. రాష్ట్రంలో ఎన్ని జిల్లాలు ఉన్నాయో తెలియని పవన్ ఇలా మాట్లాడటం సరికాదని, ఆయన ఇంకా పరిజ్ఞానం పెంచుకోవాల్సి ఉందన్నారు. రాష్ట్రంలో జనసేన, బీజేపీ బలపడే అవకాశం లేదని, వారికి భయపడాల్సిన అవసరం టీడీపీకి లేదని వర్ల రామయ్య స్పష్టం చేశారు.