ఆంధ్రప్రదేశ్‌

ఎన్నికల ముందు భృతి గుర్తొచ్చిందా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, సెప్టెంబర్ 30: నాలుగేళ్లుగా పక్కన పెట్టిన నిరుద్యోగ భృతి అంశం 6నెలల్లో ఎన్నికలు రానుండగా చంద్రబాబుకు గుర్తొచ్చిందా అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ విమర్శించారు. దీనిపై విస్తృత ప్రచారం చేసుకుంటున్నారని, ఇది కేవలం యువతను మభ్యపెట్టేందుకేనని ఆయనన్నారు. నగరంలోని సీపీఐ రాష్ట్ర కార్యాలయం దాసరి భవన్‌లో ఆదివారం పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శి జేవీ సత్యనారాయణ మూర్తితో కలిసి ఆయన విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. గత ఎన్నికల్లో ‘జాబు కావాలంటే బాబు రావాలి’ అనే నినాదంతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఎంత మందికి ఉద్యోగాలు, ఉపాధి కల్పించారో శే్వతపత్రం విడుదల చేయాలని రామకృష్ణ డిమాండ్ చేశారు. ఉద్యోగాలిస్తామని అధికారంలోకి వచ్చి ఉద్యోగం, ఉపాధి కల్పించకుండా ఇప్పుడు సవాలక్ష షరతులతో నెలకు రూ. 1000 భృతి ఇస్తామంటున్నారనీ, అంటే రోజుకు రూ. 33లతో అన్న క్యాంటీన్‌లో అన్నం తిని, చెట్టు కింద పడుకోమన్నట్లుగా చంద్రబాబు వైఖరి ఉందని దుయ్యబట్టారు. యువతను బాగుపరిచే ఆలోచన చంద్రబాబుకు లేదనీ, దరఖాస్తు చేసుకున్నవారు 5.39 లక్షల మంది అయితే 1.62 లక్షల మందిని మాత్రమే అర్హులుగా గుర్తించడంలో ఔచిత్యం ఏమిటని ప్రశ్నించారు.
ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో వ్యవసాయం దండగ అని ప్రకటించిన చంద్రబాబు ఇప్పుడు అవాస్తవాలు మాట్లాడుతున్నారన్నారు. రాష్ట్రంలో 5లక్షల ఎకరాల్లో ఇప్పటికే సేంద్రీయ వ్యవసాయం చేయిస్తున్నామనీ, 2024 నాటికి రాష్ట్రంలో 80 లక్షల హెక్టార్లలో సేంద్రీయ వ్యవసాయం చేయిస్తామని ఆయన అమెరికా పర్యటనలో చెప్పటంలో వాస్తవం లేదన్నారు. చంద్రబాబు జీవితకాలం ముఖ్యమంత్రిగా ఉన్నా ఇది సాధ్యం కాదనీ, ఆయన శాస్ర్తియతకు విరుద్ధమైన ప్రకటనలు చేస్తున్నారని విమర్శించారు. కరవు ప్రాంత బాధిత రైతులకు సహాయక చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. తనకు భద్రత లేదని జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ చెపుతుంటే ఆ విషయాన్ని ముఖ్యమంత్రి సీరియస్‌గా తీసుకోవడం లేదన్నారు. పవన్‌కల్యాణ్‌కు ఏదైనా జరిగితే చంద్రబాబే బాధ్యత వహించాలనీ, రాష్ట్ర భగ్గుమనడం ఖాయమని రామకృష్ణ అన్నారు. అగ్రిగోల్డ్ బాధితులను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం తక్షణం రూ. 1000 కోట్లు కేటాయించి చెల్లించాలని డిమాండ్ చేశారు. అక్టోబర్ 1న అగ్రిగోల్డ్ బాధితులు రాష్టవ్య్రాప్తంగా 13 జిల్లాల కలెక్టర్ కార్యాలయాల వద్ద చేపట్టిన మహాధర్నాకు సీపీఐ పూర్తి మద్దతు ఇస్తోందని రామకృష్ణ వెల్లడించారు. అరకులో జరిగిన ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే హత్యలపై ప్రభుత్వం ఇప్పటికీ స్పష్టమైన ప్రకటన చేయలేకపోయిందని, వీరి మరణాలపై సమగ్ర విచారణ జరిపించి, కారణాలను ప్రజల ముందుంచాలని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జేవీ సత్యనారాయణమూర్తి డిమాండ్ చేశారు. గిరిజన ప్రాంతాల్లో తక్షణం అక్రమ మైనింగ్ అరికట్టేందుకు చర్యలు చేపట్టాలని కోరారు.