ఆంధ్రప్రదేశ్‌

నిరుద్యోగ భృతికి సర్వం సిద్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

*నేడు ‘ముఖ్యమంత్రి యువనేస్తం’ ప్రారంభం 2లక్షల 10వేలకు చేరిన అర్హుల జాబితా
*ప్రయోగాత్మకంగా అర్థరాత్రి నుంచే రూపాయి జమ
*నిబంధనల సడలింపుతో 20వేల మందికి ప్రయోజనం*మంత్రులు, అధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష
*భృతితో పాటు అప్రంటీస్ కాలంలో మరో రూ. 1500 చెల్లింపులో సాధ్యాసాధ్యాలపై పరిశీలన
*
అమరావతి, అక్టోబర్ 1: ముఖ్యమంత్రి యువనేస్తం పథకంలో మరింత మందికి లబ్ధి చేకూరేలా నిబంధనలను సడలించాలని ముఖ్యమంత్రి చంద్ర బాబునాయుడు అధికారులకు నిర్దేశించారు. ఈ పథకానికి ఆన్‌లైన్‌లో దరఖాస్తుచేసి, అర్హత పొంది, చివరగా అప్లయి బటన్ క్లిక్ చేయని వారికి కూడా ఈ నెల నుంచే భృతి అందించాలని సూచించారు. ముఖ్యమంత్రి తాజా నిర్ణయంతో 20వేల మంది అదనంగా నిరుద్యోగ భృతికి అర్హత పొందారు. గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2న ‘ముఖ్యమంత్రి యువనేస్తం’ పథకాన్ని ప్రారంభించనున్న సందర్భంగా సోమవారం సచివాలయంలో యువజనశాఖ అధికారులతో ముఖ్యమంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రతినెలా 25వ తేదీని కటాఫ్‌గా నిర్ణయించారు. ఇప్పటి వరకు ఈ పథకం కింద 2లక్షల 10వేల మంది అర్హత సాధించారని సోమవారం అర్ధరాత్రి వరకు అర్హత పొందిన వారికి ఈనెల నుంచే నిరుద్యోగ భృతి అందించనున్నట్లు పంచాయతీరాజ్‌శాఖ మంత్రి నారా లోకేష్ ముఖ్యమంత్రికి వివరించారు. అర్హులైన లక్షా 86వేల మంది ఖాతాలకు ప్రయోగాత్మకంగా రూపాయి జమచేశామని, ఎలాంటి సాంకేతిక ఇబ్బందులు తలెత్తలేదని తెలిపారు. మంగళవారం బ్యాంక్‌లకు సెలవు కావటంతో బుధ, గురు వారాల్లో భృతిని జమ చేస్తామని వెల్లడించారు. ఇకపై ప్రతినెలా 25వ తేదీన గడువుగా పరిగణిస్తున్నట్లు వివరించారు. నైపుణ్యాభివృద్ధి శిక్షణపైనా దృష్టి సారించాలని నిరుద్యోగ భృతి కింద ఇచ్చే వెయ్యి రూపాయలతో పాటు అప్రంటీస్‌షిప్ సమయంలో అదనంగా మరో 15 వందల రూపాయలు అందించేందుకు సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. రాష్ట్రంలో ఏర్పాటవుతున్న పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా నిరుద్యోగ భృతి పొందుతున్న లబ్దిదారులకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇచ్చే అంశాలపై ముఖ్యమంత్రి చర్చించారు.
ఫిర్యాదుల సత్వర పరిష్కారం
ముఖ్యమంత్రి యువనేస్తం పథకంపై అందుతున్న వివిధ ఫిర్యాదుల సత్వర పరిష్కారానికి సంబంధిత శాఖల్లో నోడల్ అధికారులను నియమించారు. సర్వర్ స్తంభించకుండా, సాంకేతిక ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. విద్యార్హతలకు సంబంధించి ఏదైనా ఫిర్యాదు అందితే వారి రిజిస్ట్రేషన్ నెంబర్, చదివిన విశ్వవిద్యాలయం తదితర వివరాలను సంబంధిత కాలంలో పేర్కొనవచ్చు. విద్యార్హత కాపీని వెబ్‌పోర్టల్‌లో పొందుపరిచే వీలు కల్పించారు. సంబంధిత విశ్వవిద్యాలయ అధికారులతో సంప్రదించి అర్హత ఉన్న వారికి వెంటనే భృతికి అంగీకారం తెలుపుతారు. ఫిర్యాదులు ఏవైనా వారంలోగా పరిష్కరించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. పరిష్కరించిన తరువాత కూడా అభ్యంతరాలు లేవనెత్తితే తిరిగి ఆ ఫిర్యాదును పై స్థాయి అధికారుల పరిశీలనకు పంపుతారు. చివరగా పథకానికి ఎంపికైందీ, లేనిదీ నేరుగా దరఖాస్తుదారు మొబైల్ నెంబర్‌కు కారణాలతో సహా సందేశం పంపుతారు. సమీక్షా సమావేశంలో యువజన, క్రీడలుశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం, ముఖ్యమంత్రి కార్యదర్శులు గిరిజాశంకర్, రాజవౌళి, యువజన సర్వీసులశాఖ డైరెక్టర్ భానుప్రకాష్, సమాచార, పౌరసంబంధాలశాఖ కార్యదర్శి బి రామాంజనేయులు, కమిషనర్ ఎస్ వెంకటేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.
అమరావతికి లబ్ధిదారులు
ముఖ్యమంత్రి యువనేస్తం ప్రారంభోత్సవ కార్యక్రమం ఉండవల్లిలోని ప్రజావేదిక ప్రాంగణంలోనే జరగనుంది. రాష్టవ్య్రాప్తంగా 13 జిల్లాల నుంచి ఎంపికచేసిన 400 మంది యువనేస్తం లబ్ధిదారులకు ప్రవేశం ఉంటుంది. వీరందరితో ముఖ్యమంత్రి ముఖాముఖి మాట్లాడతారు. అనంతరం వీరికి యువనేస్తం ధ్రువపత్రాలను అందజేస్తారు. అదే సమయానికి 13 జిల్లా కేంద్రాలు, 175 శాసనసభ నియోజకవర్గాల్లోనూ ఈ కార్యక్రమం నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. జిల్లా కేంద్రాల్లో మంత్రులు, నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు అర్హులకు ధృవీకరణ పత్రాలు అందజేస్తారు.