ఆంధ్రప్రదేశ్‌

పసుపు-కుంకుమ డబ్బుకు పేచీ పెట్టొద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, అక్టోబర్ 1: పసుపు- కుంకుమ కింద ప్రభుత్వం లబ్ధిదారులకు ఇచ్చిన మొత్తాలను కానీ, మహిళా సంఘాల పొదుపు మొత్తాలు కానీ విత్‌డ్రా చేసుకునేందుకు బ్యాంకర్లు అడ్డుచెబితే కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా రాష్టస్థ్రాయి బ్యాంకర్ల కమిటీ (ఎస్‌ఎల్‌బీసీ)ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. లబ్ధిదారులు తమ నగదును ఖాతాలో నుంచి తీసుకునేందుకు అభ్యంతరం వ్యక్తం చేయటం సరికాదన్నారు. సోమవారం సచివాలయంలో పలు సంక్షేమ శాఖల పనితీరు, పథకాల పురోగతిపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. డిమాండ్‌కు తగ్గట్టుగా వివిధ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ఆయా వర్గాల్లో లబ్ధిదారుల ఎంపిక జరగాలని ముఖ్యమంత్రి సూచించారు. జనాభా ప్రాతిపదికన సమతుల్యత పాటించేలా ప్రక్రియ కొనసాగించాలని నిర్దేశించారు. ఎస్టీలకు 50 ఏళ్లకే వృద్ధాప్య పింఛను ఇచ్చే అంశాన్ని త్వరితగతిన అమలు చేసేలా చూడాలని ఆదేశించారు. చంద్రన్న పెళ్లి కానుక మరింత సమర్థవంతంగా, వేగవంతంగా అమలు చేయాలన్నారు. సమావేశంలో గిరిజన, సాంఘిక సంక్షేమశాఖ మంత్రి నక్కా ఆనంద్‌బాబు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రావత్ తదితరులు పాల్గొన్నారు.