ఆంధ్రప్రదేశ్‌

రాజధానికి రైతుల విరాళం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, అక్టోబర్ 1: రాజధాని అమరావతి నిర్మాణానికి పొన్నూరు నియోజకవర్గం ఉప్పలపాడు రైతులు ముందుకొచ్చారు. సోమవారం ప్రజావేదిక ప్రాంగణంలో నియోజకవర్గ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకుమార్ నేతృత్వంలో పెద్దఎత్తున రైతులు తరలివచ్చి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు రూ 5 లక్షల విరాళాన్ని అందజేశారు. రాజధాని నిర్మాణంలో రైతుల భాగస్వామ్యం అనిర్వచనీయమని ముఖ్యమంత్రి అభినందించారు. ప్రభుత్వంపై ఉన్న విశ్వసనీయతే ఇందుకు నిదర్శనమన్నారు.

ప్రొఫెసర్ డీఎల్ నారాయణ గోల్డ్‌మెడల్ ఏర్పాటు

ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గురువు ప్రొఫెసర్ డీఎల్ నారాయణ జ్ఞాపకార్థం తిరుపతి శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ఆర్థిక శాస్త్రంలో ఉత్తమ పరిశోధన నిర్వహించే పీహెచ్‌డీ విద్యార్థికి ప్రతి ఏటా బంగారు పతకాన్ని అందించేందుకు ఆయన కుమారుడు ప్రొఫెసర్ డీవీ రమణ ముందుకొచ్చారు. ఈ మేరకు సోమవారం గ్రీవెన్స్‌సెల్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబును కలుసుకుని రూ 3లక్షల చెక్కును అందజేశారు.

సమాచార కమిషనర్ల నియామకం

విజయవాడ, అక్టోబర్ 1: రాష్ట్ర సమాచార హక్కు చట్టం కమిషనర్లుగా ముగ్గురిని రాష్ట్ర ప్రభుత్వం సోమవారం నియమించింది. రిటైర్డ్ ఐఎఫ్‌ఎస్ అధికారి ఎం.రవి కుమార్, రిటైర్డ్ ఐపీఎస్ అధికారి బి.వి.రమణ కుమార్, న్యాయవాది కట్టా జనార్ధనరావును నియమించింది. వీరు ఆ పదవిలో ఐదు సంవత్సరాలు లేదా 60 సంవత్సరాల వయసు వరకూ కొనసాగుతారు.