ఆంధ్రప్రదేశ్‌

ప్రతిష్టాత్మకంగా దసరా ఉత్సవాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, అక్టోబర్ 1: ఈ ఏడాది దసరా ఉత్సవాలను ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదేశించారు. సోమవారం ప్రజావేదిక ప్రాంగణంలో ముఖ్యమంత్రిని విజయవాడ శ్రీ దుర్గా మల్లేశ్వరస్వామి ఆలయ పాలకమండలి చైర్మన్ గౌరంగబాబు, దేవాదాయశాఖ కమిషనర్ పద్మ, దుర్గగుడి ఈఒ కోటేశ్వరమ్మ, పాలకమండలి సభ్యులు కలుసుకుని దసరా దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల ఏర్పాట్లపై చర్చించారు. ముఖ్యమంత్రికి ఆహ్వానపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ నూతన క్యాలండర్‌ను ఆవిష్కరించారు. భక్తులకు అసౌకర్యం కలుగకుండా, అవాంఛనీయ సంఘటనలకు తావివ్వకుండా ఉత్సవాలను నిర్వహించాలని ముఖ్యమంత్రి సూచించారు.

‘ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తా’

విజయవాడ, అక్టోబర్ 1: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎదుర్కొంటున్న వివిధ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అనిల్ చంద్ర పుణేఠా హామీ ఇచ్చారు. సీఎస్‌గా బాధ్యతలు స్వీకరించిన ఆయనను వెలగపూడి సచివాలయంలో మర్యాదపూర్వకంగా సోమవారం ఏపీ జేఏసీ అమరావతి ప్రతినిధులు బొప్పరాజు వెంకటేశ్వర రావు, ఫణి పేర్రాజు, మురళీకృష్ణనాయుడు తదితరులు కలిశారు. 11వ పీఆర్సీని త్వరగా పొందేందుకు చర్యలు తీసుకోవాలని, సీసీఎస్ రద్దుకు చర్యలు తీసుకోవాలని, ఉద్యోగుల ఆరోగ్య కార్డులు, తదితర అంశాలను సీఎస్ దృష్టికి తీసుకువచ్చారు. సీఎస్ స్పందిస్తూ, ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తానని, నవ్యాంధ్ర కోసం పని చేస్తున్న ముఖ్యమంత్రికి బాధ్యతాయుతంగా సహకరించాలన్నారు.