ఆంధ్రప్రదేశ్‌

15వ ఆర్థిక సంఘానికి ప్రతిపాదనలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, అక్టోబర్ 1: రాష్ట్రంలో ఈనెల 10 నుంచి 12వ తేదీ వరకు 15వ ఆర్థిక సంఘం పర్యటించనున్న నేపథ్యంలో ఏర్పాట్లపై ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు సోమవారం సచివాలయంలో ఆర్థికశాఖ ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆర్థిక సంఘం సభ్యులు ఈనెల 11న సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు, రాష్ట్ర మంత్రులు, ఉన్నతాధికారులతో సమావేశమవుతారు. 12న రాష్ట్రంలోని రాజకీయ పార్టీలు, స్థానిక సంస్థల ప్రతినిధులతో చర్చిస్తారు. ఇందులో భాగంగా ప్రాంతీయ పర్యటనలు చేయనున్నారు. ఆర్థిక సంఘంతో చర్చించాల్సిన ముఖ్యమైన అంశాలపై ఆర్థికశాఖ ఉన్నతాధికారులకు మంత్రి యనమల పలు సూచనలు చేశారు. ఆర్థిక సంఘానికి రాష్ట్రం తరుపున అందించే ప్రతిపాదనలపై ప్రస్తావించారు.