ఆంధ్రప్రదేశ్‌

గుంటూరు పశ్చిమ వైసీపీలో చిచ్చు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, అక్టోబర్ 1: గుంటూరు పశ్చిమ నియోజకవర్గ వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త పదవి నుండి లేళ్ల అప్పిరెడ్డిను తొలగించి చంద్రగిరి ఏసురత్నంను నియమించడంపై పార్టీ శ్రేణులు భగ్గుమన్నాయి. పార్టీ ఆవిర్భావం నుంచి అధ్యక్షుడు జగన్ వెంట ఉంటూ జెండామోసిన అప్పిరెడ్డిని ఏకపక్షంగా తొలగించడంపై పార్టీ కార్యకర్తలు, నేతల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. సోమవారం విషయం తెలుసుకున్న పశ్చిమ నియోజకవర్గ శ్రేణులు, పలు విభాగాల నేతలు అరండల్‌పేటలోని నగర కార్యాలయానికి చేరుకుని జగన్‌కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. తక్షణం మూకుమ్మడిగా రాజీనామా చేస్తామని అల్టిమేటం జారీచేశారు. తమకు పార్టీ ముఖ్యం కాదని అప్పిరెడ్డి తర్వాతే ఏదైనా అంటూ ఆందోళనకు దిగారు. అప్పిరెడ్డికి అన్యాయం జరిగిన పార్టీలో అర నిమిషం కూడా ఉండే ప్రసక్తే లేదని తెగేసి చెప్తూ యువ నాయకులు హఠాత్తుగా ఒంటిపై పెట్రోల్ పోసుకునే ప్రయత్నం చేశారు. దీంతో పార్టీ కార్యాలయంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు పార్టీ నగర కార్యాలయానికి చేరుకుని ఆందోళనకు దిగిన యువతను సముదాయించే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా అప్పిరెడ్డి కార్యాలయం నుంచి బయటకు వచ్చి ఇప్పటివరకు పార్టీ సిద్ధాంతం కోసం, జగన్‌ను సీఎం చేయడం కోసం చిత్తశుద్ధితో కృషిచేస్తూ వచ్చానని అన్నారు. ఇలాంటి సమయంలో పార్టీ తీసుకున్న నిర్ణయం బాధ కల్గించిందని, అయితే తొందరపడి ఎవరూ, ఎటువంటి నిర్ణయాలు తీసుకోవద్దని తెలిపారు. తాను అందరినీ వ్యక్తిగతంగా కలిసి అభిప్రాయాలు తీసుకుంటానని, ఆ తర్వాతే నిర్ణయం తీసుకుందామని, అప్పటివరకు అందరూ సంయమనం పాటించాలని అప్పిరెడ్డి విజ్ఞప్తిచేశారు.