ఆంధ్రప్రదేశ్‌

బీజేపి ఒక్కసీటు గెలిచినా రాజకీయ సన్యాసం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, అక్టోబర్ 1: ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ ఒక్క సీటు గెలిచినా రాజకీయ సన్యాసం చేస్తానని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి జవహర్ సవాల్ విసిరారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అసత్యాలను భుజాన వేసుకుని రాష్టమ్రంతటా తిరుగున్నారని విమర్శించారు. సోమవారం గుంటూరులోని టీడీపీ రాష్ట్ర కార్యాలయం ఎన్‌టిఆర్ భవన్‌లో ఏర్పాటుచేసిన విలేఖర్ల సమావేశంలో మంత్రి జవహర్ మాట్లాడుతూ బీజేపీ, వైసీపీ, జనసేనలపై నిప్పుల చెరిగారు. రాష్ట్రం విడిపోయిన తర్వాత అనేక కష్టనష్టాలు ఎదురవుతున్నా ముఖ్యమంత్రి చంద్రబాబు తన అనుభవాన్నంతా రంగరించి 1500 రోజుల్లో ఆంధ్రప్రదేశ్‌ను అభివృద్ధికి చిరునామాగా నిలిపారని కొనియాడారు. రాష్ట్రంలో గతంలో ఎన్నడూ లేనివిధంగా అభివృద్ధి జరుగుతున్నప్పటికీ బీజేపీ, వైసీపీ, జనసేనపార్టీలు విషం చిమ్మడమే పనిగా పెట్టుకున్నాయని విమర్శించారు. జగన్, పవన్‌లు బీజేపీకి చెందిన జెండా, అజెండాను చేతిలో పట్టుకుని తిరుగుతున్నారని దుయ్యబట్టారు. కళ్లకు కనబడే అభివృద్ధిని కళ్లుండీ చూడలేక పోతున్నారని, అభివృద్ధి ఎక్కడ జరగలేదో ఆ మూడు పార్టీలు నిరూపించాలని, దీనిపై రాష్ట్రంలో ఏ సెంటర్‌లోనైనా చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు. పవన్‌కు ఏమైందో అర్థం కావడం లేదని, కేంద్రం నుంచి రావాల్సినవి అడగకుండా మళ్లీ ప్రశ్నించడానికే పుట్టానంటూ ప్రజలను నమ్మబలికే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. 18 విభజన హామీలపై పల్లెత్తు మాటకూడా మాట్లాడని పవన్ రాష్ట్రంలో రెండు మూడు సీట్లు గెలుచుకుని రిటైల్‌గా అమ్ముకుందామని చూస్తున్నాడని విమర్శించారు. అన్న చిరంజీవి పిఆర్‌పిని హోల్‌సేల్‌గా అమ్మేస్తే, పవన్ రిటైల్‌గా అమ్ముకుందామని చూస్తున్నాడని ఆరోపించారు. దళితులపై జగన్ కపటప్రేమ చూపిస్తున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో దళితులు అభివృద్ధి చెందుతున్నారంటే చంద్రబాబు చేస్తున్న కృషి, చూపుతున్న చొరవేనని పేర్కొన్నారు. గతంలో ఏ ప్రభుత్వమూ ఖర్చుచేయని విధంగా తెలుగుదేశం హయాంలో దళితుల సంక్షేమం కోసం 40 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు చెప్పారు. అమరావతి దళితుల కంచుకోట అని, వారి అభ్యున్నతి కోసమే అమరావతి నిర్మాణం జరుగుతుందని తెలిపారు. ధర్మపోరాట దీక్షకు లక్షలాది మంది ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చారని, వచ్చే ఎన్నికల్లో జిల్లాలో తిరిగి మొత్తం 15 సీట్లు గెలవడం ఖాయమని మంత్రి జవహర్ స్పష్టంచేశారు.