ఆంధ్రప్రదేశ్‌

నేడు రాష్ట్ర మంత్రివర్గ సమావేశం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ(సిటీ), ఆక్టోబర్ 2: ఆంధ్రప్రదేశ్ మంత్రి మండలి సమావేశం వెలగపూడి సచివాలయంలో బుధవారం మధ్యాహ్నం 3 గంటలకు జరుగుతుంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో ఇటీవల నక్స్‌ల్స్ చేతిలో హత్యకు గురైన ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమకు క్యాబినెట్ సంతాపం తెలపనుంది. విశాఖ జిల్లాలో నక్సల్స్ చేతిలో ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే హత్యానంతరం జరిగిన పరిణామాలపై చర్చించనున్నారు. లివిటిపుట్టి ఘటన ఆనంతరం ఆగ్రహంతో పోలీస్ స్టేషన్‌లపై గిరిజనుల దాడి, రాష్ట్రంలో నెలకొన్న శాంతిభద్రతలపై మంత్రి మండలి చర్చించనుంది. అలాగే రాష్ట్రంలో నెలకొని ఉన్న వర్షాభావ పరిస్థితులుపై కూడా మంత్రి మండలి చర్చించనుంది. వీటితో పాటు రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు, ముఖ్యమంత్రి యువనేస్తం పథకంపైన, గ్రామదర్శిని- గ్రామ వికాసంపై కూడా మంత్రి మండలి సమీక్షించనుంది.
ముందుగా టీడీపీ సమన్వయ కమిటీ సమావేశం
మంత్రి మండలి సమావేశానికి ముందుగా బుధవారం ఉదయం 10 గంటలకు తెలుగుదేశం పార్టీ సమన్వయకమిటీ సమావేశం జరగనుంది. టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది. ఉండవల్లి గ్రీవెన్స్ హాల్‌లో నిర్వహించే ఈ సమావేశంలో ఏపీ టీడీపీ అధ్యక్షుడు కిమిడి కళావెంకట్రావు పాల్గొననున్నారు. రాష్ట్రంలో గ్రామదర్శిని - గ్రామ వికాసం జరుగుతున్న తీరు, నియోజకవర్గాల్లో పార్టీ నేతలు పాల్గొంటున్న విధానాన్ని సమీక్షించనున్నారు. ఇదే సమయంలో పార్టీని మరింత బలోపేతం చేసే క్రమంలో రాజకీయ పరిస్థితులపై చర్చించనున్నారు.