ఆంధ్రప్రదేశ్‌

యువత ఆలోచనా విధానాల్లో మార్పులు అవసరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మదనపల్లె, అక్టోబర్ 3: ప్రభుత్వాలు మారాలంటే 18ఏళ్ళు నిండిన యువత ఓటరులుగా మారాలని సీబీఐ మాజీ జెడీ లక్ష్మీనారాయణ పిలుపునిచ్చారు. విద్యార్థులు, యువతలో ఆలోచన విధానాలలో మార్పులు చాలా అవసరం అన్నారు. చిత్తూరు జిల్లా మదనపల్లెలో బుధవారం యువత, విద్యార్థులతో ఆయన ఆత్మీయ సభలో మాట్లాడుతూ జీవితంలో ఓ లక్ష్యాన్ని ఏర్పాటుచేసుకోవాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు. విద్యార్థిదశలోనే జీవితాన్ని లక్ష్యం ఎంపిక చేసుకుని ఏవిధంగా ఆలోచించుకోగలిగితే విద్యాయాత్ర సుమనంగా వెళుతుందన్నారు. లక్ష్యాన్ని ఎంపిక చేసుకుని ముందుకు సాగితే ఖచ్చితంగా చేరుకుని జీవితంలో మార్పులు వస్తాయన్నారు. ప్రజల ఆలోచన విధానాలలో మార్పులు రావాలని పిలుపునిచ్చారు. 18సంవత్సరాలు ఉన్న వారందరూ ఓటుహక్కు కల్గివుండాలి, ఈనెలాఖరులోగా నమోదు చేసుకోవాలన్నారు. ఓటరులుగా మారినప్పుడే ప్రభుత్వాలను నిలదీసే శక్తి ఉంటుందని ఉద్బోధించారు. నేడు బాధ్యతలు నిర్వర్తించగలిగితే రేపు మన హక్కుల గురించి మాట్లాడే అవకాశం మనకు లభిస్తుందన్నారు. యువతరంతో దేశంలో మార్పులు సాధ్యం అవుతుందన్నారు. అందుకే యువత ఓటరుగా మారాలి, ఫ్రభుత్వ విధానాలు మారాలి, రైతుల పరిస్థితులు బాగుండాలి, చదువులు పూర్తిచేసిన విద్యార్థులకు ఉద్యోగాలు రావాలి, నిరుద్యోగ యువత చిన్నచిన్న పరిశ్రమలు స్థాపించాలన్నారు. ఇటువంటి నిర్ణయాలు ప్రభుత్వాలు తీసుకోవాలంటే యువత ఓట్లు ద్వారా తీర్పు ఇచ్చినప్పుడే ప్రభుత్వానికి బాధ్యత కలుగుతుందన్నారు. సమాజంలో యువత మేల్కొనడం ద్వారా మార్పులు కూడా ఉదయిస్తాయని స్వామి వివేకానంద స్పూర్తి గుర్తుచేశారు.