ఆంధ్రప్రదేశ్‌

ఉపాధి హామీ కార్యాలయ సహాయకులకు వేతనాలు పెరిగాయ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, అక్టోబర్ 3: ఉపాధి హామీ పథకం మండల కంప్యూటర్ సెంటర్(ఎంసీసీ)ల్లో పని చేస్తున్న కార్యాలయ సహాయకుల వేతనం నెలకు రూ.3000 నుంచి రూ.6000లకు పెంచుతున్నామని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ సంచాలకులు పి రంజిత్ బాషా బుధవారం ఒక ప్రకటనలో తెలియజేశారు. స్వయం సహాయక సంఘాలు ఎంపిక చేసిన మహిళలను మండల ఉపాధి కార్యాలయంలో పారిశుద్ధ్యం తదితర పనులు చేయడానికి నెలకు రూ.3000 వేతనం చెల్లించేలా నియమించారని, ఏళ్లుగడిచినా వారి వేతనాల్లో పెంపు లేదని, సహాయకుల వేతనాల పెంపు అంశాన్ని ప్రజా ప్రతినిధులు, ఉపాధి హామీ మండలి సభ్యులు రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుని రావడంతో వారి కష్టాలను తెలుసుకుని ఆయన కూడా సానుకూలంగా స్పందించారని అన్నారు.
వారు చేస్తున్న పనికి కనీస వేనతం అందించాలన్న ముఖ్యమంత్రి ఆలోచనలకు అనుగుణంగానే వేతనాల పెంపునిర్ణయం తీసుకున్మామని సంచాలకులు పేర్కొన్నారు. ఎన్నో సంవత్సరాలుగా ఎంసీసీల్లో పని చేస్తున్న కార్యాలయ సహాయకుల వెతలను అర్థం చేసుకున్న పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి నారా లోకేష్ వేతనాల పెంపు ఫైల్ మీద మంగళవారం సంతకం చేశారని ఆయన చెప్పారు. 661 ఎంసీసీల్లోని 661 మంది సహాయకులు దీనివల్ల లబ్ధి పొందుతారన్నారు. ఉపాధి హామీ సిబ్బంది సమస్యలపై గ్రామీణాభివృద్ధిశాఖ ఎప్పుడూ సానుకూలంగానే స్పందిస్తోందన్నారు. ఉపాధి హామీ, వాటర్ షెడ్ కార్యక్రమంలో పనిచేస్తూ మూడు సంవత్సరాలు పూర్తి చేసుకున్న 481 మంది అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను ఫిక్స్‌డ్ టెన్యూర్ ఎంప్లారుూస్ (ఎఫ్‌టీఇ)గా మార్చామని గుర్తు చేశారు.
పథకంలో పని చేస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్లు, ఎఫ్‌టీఇల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రమాదంలో వారు మరణించినట్లయితే ఇచ్చే పరిహారాన్ని రూ.3లక్షల నుంచి రూ.5లక్షలకు, ఏదైనా ప్రమాదంలో శాశ్వత అంగవైకల్యానికి గురైనట్లయితే వారికిచ్చే పరిహారాన్ని లక్షా 50వేల నుంచి 3లక్షలకు పెంచామని చెప్పారు. ఇవన్నీ కూడా పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా నారా లోకేష్ బాధ్యతలు చేపట్టాకే జరిగిన పరిణామాలన్నారు. ఉద్యోగుల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నామని సంచాలకులు రంజిత్ బాషా తెలియజేశారు.